»   » సర్దార్: పవన్ స్నేహితుడు నష్టపోయిందెంతో తెలుసా?

సర్దార్: పవన్ స్నేహితుడు నష్టపోయిందెంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా నటించడంతో పాటు... కథ, స్క్రీన్ ప్లే బాధ్యతలు కూడా తానే నిర్వర్తించి చేసిన చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. భారీ అంచనాలతో రిలీజైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డ సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాత పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద సినిమా బిజినెస్ క్లోజ్ అయింది. లాభనష్టాలే బేరీజు వేసాక ఈ సినిమా వల్ల శరత్ మరార్ రూ. 8 కోట్ల వరకు నష్టపోయినట్లు తేలిందట.

వాస్తవానికి 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం షూటింగ్ అనుకున్న సమయానికి, అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగలేదు. దీనికి తోడు మధ్యలో సినిమాటోగ్రాఫర్ ను మార్చేయడం, హీరోయిన్ ను మార్చేయడం, డైరెక్టర్ ను మార్చేయడం, ఆర్ట్ డైరెక్టర్ ను మార్చేయడం ఇలా చాలా విషయాలు జరిగాయి. బహుషా ఏ స్టార్ హీరో సినిమా విషయంలో కూడా సినిమా మొదలయ్యాక ఇన్ని మార్పులు జరిగి ఉండవు.

మధ్యలో తప్పించిన వారందరికీ శరత్ మరార్ ముందుగానే రెమ్యూనరేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల కూడా ఖర్చు తడిసి మోపెడైంది. లాభాలు వస్తాయనే నమ్మకంతో శరత్ మరార్ ఇవన్నీ భరించారు. కానీ చివరకు ఆయనకు మిగిలింది 8 కోట్ల నష్టం.

Sharrath Marar Lost 8 Crore with Sardaar?

ఈ చిత్రాన్ని తొలుత సంపత్ నంది డైరెక్టర్ గా ప్రకటించి ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. దాదాపు సంవత్సరం గడిచాక ఆయన్ను మార్చారు. ఆయన ప్లేసులో కె.ఎస్.రవీంద్ర(బాబీ)ని తీసుకున్నారు. తొలుత ఈచిత్రానికి జైనన్ విన్సెంట్ ను సినిమాటోగ్రాఫర్ గా నిర్ణయించారు. తర్వత ఆయన్ను మార్చి ఆర్తుర్ విల్సన్, ఆండ్రూలను తీసుకున్నారు.

ఈ చిత్రానికి తొలుత పవన్ కళ్యాణ్ ఫ్రెండ్, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి వారం పాటు పని చేసారు. తర్వాత ఆయన స్థానంలో బ్రహ్మకడలిని మార్చారు. తొలుత ఈ సినిమాకు అనీషా ఆంబ్రోస్ ను అనుకున్నారు. ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చి బుక్ చేసుకున్నారు. తర్వాత ఆమె సెట్ కాదని హీరోయిన్ కాజల్ కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకున్నారు.

ఇలా అన్ని కలిసి బడ్జెట్ ఓవర్ అయింది. సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చినా భారీ బడ్జెట్ లోటును పూడ్చలేక పోయాయి. అందుకే శరత్ మరార్ నష్టాన్ని పూడ్చడానికి మరో సినిమా చేస్తున్నారు పవన్. ప్రస్తుతం ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ చేస్తున్న చిత్రానికి నిర్మాత శరత్ మారారే.

English summary
If the trade buzz is to be believed, producer Sharrath Marar had lost Rs 8 Crore with Sardaar Gabbar Singh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu