»   »  షీలాపైనే 'పరుగు' నిందలు

షీలాపైనే 'పరుగు' నిందలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sheela
అల్లు అర్జున్ , షీలా జంటగా భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'పరుగు' సినిమా అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ తుస్సుమంది. దాంతో ఆ ఫెయిల్యూర్ క్రెడిట్ మొత్తం హీరోయిన్ పాత్రధారి షీలా పైకి నెట్టేస్తున్నారు. ఆమె మొదటి నుంచి ఐరన్ లెగ్ అని అందుకే ఇలా జరిగింది అంటున్నారు. కాని మరో వర్గం మాత్రం ఫెయిల్యూర్ భాద్యత మొత్తం రెండో గండం దాటలేని భాస్కర్ దే అంటున్నారు. 'సీతాకోకచిలుక' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తమిళ ముద్దు గుమ్మ షీలా. ఆ సినిమా తరవాత ఆమె దిల్ రాజు సమర్పించిన 'హలో ప్రేమిస్తారా' లో పూరీ తమ్ముడు సాయిరామ్ శంకర్ సరసన నటించింది. ఈ రెండు ఫ్లాపు అయ్యాయి. అయినా దర్శకుడు భాస్కర్ ఆమెను యేరికోరి ఎంపిక చేసుకున్నాడు.

నిజానికి 'దేశముదురు' తర్వాత విపరీతమైన స్టార్ డమ్ సంపాదించిన అల్లు అర్జున్ ప్రక్కన ఏ త్రిషానో , ఇలియానానో పెట్టుకోవచ్చు. కానీ సినిమాలో ఉండే అమాయకపు పల్లె పడుచు పాత్రకు షీలానే సూటవుతుందని భాస్కర్ భావించాడట. దాంతో మంచి ఆఫర్ వచ్చినందుకు ఆమె కూడా చాలా సంతోషపడింది. కాని సీను రివర్స్ అయింది. దాంతో ఆమె మెదటి నుంచి ఐరన్ లెగ్ అందుకే ఇలా జరిగింది అని ఆమె పైకి పరాజయాన్ని త్రోసే ప్రయత్నం చేస్తున్నారు సెంటిమెంట్లును విపరీతంగా నమ్మే సినిమా వారు.

కాని మరో వర్గం మాత్రం తెలుగు దర్శకులకు తప్పని రెండో సినిమా గండం భాస్కర్ దాటలేక పోయాడని కామెంట్లు చేస్తున్నారు. మొదటి సినిమా హిట్టు కిక్కు అతన్ని హేంగోవర్ లో ఉంచిందని అందుకే కథని తనిష్టమొచ్చినట్లు నడిపాడని అంటున్నారు. 'బొమ్మరిల్లు' లో తండ్రి కొడుకుల మద్య చోటు చేసుకునే కమ్యూనికెషన్ గ్యాప్ అనే సున్నితమైన అంశాన్ని చక్కని స్కీన్ ప్లే తో నడిపిన భాస్కర్ ఈ సినిమాలో అదే మిస్సయ్యాడని అంటున్నారు. అయినా ఈ సినిమా హిట్టయినా హోల్ అండ్ సోల్ గా అతనికే పేరొచ్చేలా కథని నడిపాడని, ఆఖరికి అల్లు అర్జన్ లో ఉన్న ఎనర్జీని, మాస్ ఇమేజ్ ని కూడా ప్రక్కన పెట్టాడని వారు వాదిస్తున్నారు. కాబట్టి షీలా కన్నా భాస్కర్ దే ఈ సినిమా పరాజయ భాద్యత అని డిసైడ్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X