»   » చంద్రబాబుని ఉద్దేశించేనా శేఖర్ కమ్ముల?

చంద్రబాబుని ఉద్దేశించేనా శేఖర్ కమ్ముల?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :"ఎవరో అంటే విన్నాను... హైదరాబాద్‌లాంటి నగరం కడతానని. హైదరాబాద్ అంటే బిల్డింగులు, బ్రిడ్జీలు కాదు. బంధాలు.. అనుబంధాలు.సింగపూర్ లాంటి నగరాన్ని కట్టగలరు. కానీ, హైదరాబాద్‌ని మరపించే నగరాన్ని నిజాం కూడా తిరిగి కట్టలేడు" అంటూ హైదరాబాద్ పై తన అభిమానం వెల్లబుచ్చారు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే సింగపూర్ లాంటి నగరం అని పదే పదే చెప్పేది చంద్రబాబు కాబట్టి...చంద్రబాబు ని ఉద్దేశించి శేఖర్ కమ్ముల అన్నారని కొందరు సినిమా జనాలు అంటున్నారు. అయితే ఈ స్టేట్ మెంట్ లో శేఖర్ కమ్మలుకు హైదరాబాద్ అంటే ఉన్న ప్రేమనే తీసుకోవాలి.

Shekar Kammula about hyderabad

శేఖర్ కమ్ముల నిర్మాతగా వేరే దర్శకుడుతో ఓ చిత్రం చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. శేఖర్ కమ్ములతో పాటు మధురా శ్రీధర్ సైతం ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోనున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే రామరాజు. ఆయన డైరక్ట్ చేసిన చిత్రం మల్లెల తీరంలో సిరమల్లె పూవు. ఈ సినిమా కొందరు మేధావుల ప్రశంసలు పొందినా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఈ కొత్త చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది.

ఇక రీసెంట్ గా శేఖర్ కమ్మల... నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'అనామిక'. హిందీలో విజయవంతమైన 'కహానీ' సినిమా ఆధారంగా రూపొందింది. అక్కడ విద్యాబాలన్‌ పోషించిన పాత్రలో ఇక్కడ నయనతార నటించింది. వైభవ్‌, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రలు పోషించారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. ఎండమోల్‌ ఇండియా, లాంగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది.

English summary
Shekar Kammula said that no one will consturct Hyderbad type city again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu