»   » భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నపవన్-మహేష్

భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నపవన్-మహేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం తెలుగులో లీడ్ పొజిషన్లో కొనసాగుతున్నది ఈ ఇద్దరు హీరోలే. ఇప్పటికే ఎవరూ ఊహించనంత రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ఇద్దరూ మరో ఆసక్తికర విషయంతో వార్తల్లోకెక్కబోతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో యూటివి మోషన్ పిక్చర్స్ సంస్థతో ఓ సినిమా చేయబోతున్నారు. దేశంలోని అతిపెద్ద సినీ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈ సంస్థ మహేష్ బాబుతో చేసే చేయబోయే సినిమాకు రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరో వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో దక్షిణాది పెద్ద సినీ నిర్మాణ సంస్థలో ఒకటైన పివిపి బేనర్లో సినిమా చేయబోతున్నారు. వీరు కూడా పవన్ కళ్యాణ్‌కు రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

పవన్ కళ్యాన్ ఇటీవలే తన తాజా సినిమా 'అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈచిత్రం ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవుతోంది. మరో వైపు మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో '1'(నేనొక్కడినే) చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందు. ఈచిత్రం ఇప్పుడు యూరఫ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

English summary
As per the source Mahesh has reportedly signed for UTV Motion Pictures new film. Also, for this movie the UTV banner is going to pay Rs.20 crores as his remuneration. Meanwhile, Power Star Pawan Kalyan is also expected to be paid Rs.20 crores for PVP Cinemas. With this reports both the Heroes Prince Mahesh Babu and Powerstar Pawan Kalyan are said to be the top remuneration takers in Tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu