»   » జనతా గ్యారేజ్ స్టోరీ ఇదేనా!?: అయితే సూపర్ హిట్ గ్యారెంటీ

జనతా గ్యారేజ్ స్టోరీ ఇదేనా!?: అయితే సూపర్ హిట్ గ్యారెంటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మిర్చి, శ్రీమంతుడు సినిమాల డైరెక్ట‌ర్ కొరటాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న జ‌న‌తా గ్యారేజ్ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సారధి స్టూడియోలో జరుగుతోంది.

ఎన్టీఆర్ ఓ మెకానిక్ గా ఉంటాడు. అతను మామయ్యగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా సాదాసీదాగా ఉంటాడు. హీరో అంటే మామకు చాలా ఇష్టం అయితే అది నచ్చని మోహన్ లాల్ తనయుడు ఉన్ని ముకుందన్ కు నచ్చదు. అయితే హైదరాబాద్ లో నివసిస్తున్న మోహన్ లాల్ కు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది.


ప్రస్తుతం కామన్ మ్యాన్ లా కనిపిస్తున్న అతను ఓ మాఫియా డాన్. అయితే, డాన్ గా అందరిని భయపెట్టిన వ్యక్తి కొన్ని కారణాల వలన డాన్ వృత్తి నుంచి బయటకు వస్తాడు. అలా బయటకు వచ్చిన మోహ‌న్‌లాల్ ముంబైలో జనతా గ్యారేజ్ స్థాపిస్తాడు. ఇక ఐఐటి స్టూడెంట్ అయిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో తన పెదనాన్నకు సహాయపడుతుంటాడు.అయితే వాటిననంటిని కాదనుకుని మాములు జీవితాన్ని గడుపుతుంటాడు.


Shocking Rumour.. Jr NTR Janatha Garage Movie Story Leaked

ముంబైలో అనుకోకుండా జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల మోహన్ లాల్ డాన్ పెద్ద డాన్ అన్న విషయం ఎన్టీఆర్ కు తెలుస్తుంది. డాన్ గా అందరిని హడలెత్తించిన మోహన్ లాల్ ఎందుకు ముంబైలో గ్యారేజ్ పెట్టుకుని సైలెంట్‌గా ఉన్నాడో తెలుసుకునేందుకు ఎన్టీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగుతాడు.


మామను దెబ్బ తీసిన వారి మీద చావు దెబ్బ కొట్టేందుకు తానే ఒక డాన్ గా మారుతాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ అక్కడ తనకు తగిలే షాక్ ఎవరి వల్ల అంటే మోహన్ లాల్ తనయుడు ఉన్ని ముకుందన్ వల్లే. సో ఈ కథతో సినిమా నేపథ్యం సాగుతుంది అని కథ ఒకటి ఫిల్మ్ నగర్లో చెక్కర్లు కొడుతుంది.


మ‌రి ఈ స్టోరీలో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే ఆగ‌స్టు 12 వ‌ర‌కు వెయిట్ చేయాలి. ఎందుకంటే అదే రోజున గ్యారేజ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

English summary
Jr NTR New Movie Janatha Garage Movie Story Leaked..?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu