twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గౌతమిపుత్ర శాతకర్ణి’‌: ప్చ్...బాలయ్యకు ఈ సమస్య ఇంకా తెగలేదా?

    By Srikanya
    |

    హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం రెండో షూటింగ్‌ షెడ్యూల్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కానీ ఇప్పటివరకూ హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు.

    మొదటి నుంచి ఈ చిత్రంలో హీరోయిన్ నయనతార, అనుష్క అంటూ పేర్లు వినపడుతున్నాయి. అయితే ఈ వరుసలో ఇప్పుడు ఇంకో ఇద్దరు చేరారు. అయితే రెమ్యునేషన్, వారి డేట్స్ వంటి సమస్యలతో వారిద్దరినీ కాదనుకుని.. శ్రియ కానీ ఇలియానాని ఫైనల్ చేసే అలోచనలో ఉన్నట్లు సినీ పరిశ్రమ వర్గాల సమాచారం. దాదాపుగా శ్రియనే ఫైనలైజ్ అయ్యే అవకాసం ఉంది.

    ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలనాటి నటి హేమమాలిని ఈ చిత్రంలో బాలకృష్ణ తల్లి పాత్రను పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం తొలి షూటింగ్‌ షెడ్యూల్‌ను మొరాకోలో పూర్తి చేసుకుంది.

    Shriya Saran In Balayya’s Gautamiputra Satakarni

    దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ... ఎన్నో హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకున్న మొరాకోలోని అట్లాస్ స్టూడియో, వరు జార్జియస్‌లో చిత్రీకరణ జరిపాం. ఒకటవ శతాబ్దం నాటి కాలమాన పరిస్థితుల్ని మన కళ్లముందుంచే లొకేషన్లలో ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ నేతృత్వంలో భారీ పోరాట ఘట్టాల్ని తెరకెక్కించాం. బాలకృష్ణ, విలన్ కబీర్‌బేడికి మధ్య వచ్చే యుద్ధ సన్నివేశాల్ని చిత్రీకరించాం.

    ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం రెండు వందల గుర్రాల్ని, ఒంటెలను ఉపయోగించాం. ఈ యుద్ధ ఘట్టాల్లో దాదాపు 1000మంది పాల్గొన్నారు. మొరాకోలో తొలిసారి చిత్రీకరణ జరుపుకున్న భారతీయ చిత్రంగా గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్ర సృష్టించింది అన్నారు.

    Shriya Saran In Balayya’s Gautamiputra Satakarni

    నిర్మాతలు మాట్లాడుతూ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం క్రింద పరిపాలించిన మహా చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. తెలుగువారందరూ తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది. భారతదేశంలోనే మహాయోధుడైనటువంటి గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్రను వెండితెర దృశ్యమానం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాము. దర్శకుడు క్రిష్ జనరంజకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు అని చెప్పారు.

    ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్,ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతం: దేవీశ్రీప్రసాద్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, దర్శకత్వం: క్రిష్.

    English summary
    The makers of Gautamiputra Satakarni are planning to approach gorgeous actress Shriya Saran to play the female lead role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X