»   » టైమ్ ని పవన్ నమ్ముతున్నాడా..సెంటిమెంట్ కు లొంగుతున్నాడా?

టైమ్ ని పవన్ నమ్ముతున్నాడా..సెంటిమెంట్ కు లొంగుతున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఫ్లాఫ్ అయ్యాక పవన్..సెంటిమెంట్స్ ని నమ్ముతున్నాడా అంటే అవుననే అంటున్నారు. ఆయన తన తాజా చిత్రం కోసం శృతి హాసన్ ని సెంటిమెంట్ గా హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు వినపడుతోంది. పవన్ తన హ్యాలీడేస్ నుంచి వచ్చాక ఈ విషయమై ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాసం ఉంది.

పవన్ కళ్యాణ్ వరస ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడు ఆయన చేసిన చిత్రం గబ్బర్ సింగ్. ఆ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ కావటంతో ఆమెతో మరోసారి చేయాలని ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు. ఆమెకు కూడా గబ్బర్ సింగ్ చిత్రంతోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. దర్శకుడు సూర్య ఈ విషయమై ఆమెను సజెస్టు చేసినట్లు చెప్తున్నారు. దాదాపు శృతిహాసన్ డేట్స్ ఫైనలైజ్ అయ్యిపోయాయని, ఎగ్రిమెంట్ మాత్రమే జరగాలని చెప్తున్నారు.

Shruti Haasan to romance Pawan Kalyan again?

ఇక మరో ప్రక్క గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా పవన్ కళ్యాణ్ ఓ చిత్రం ప్లాన్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. దాసరి నిర్మాతగా రూపొందే చిత్రానికి హరీష్ శంకర్ ఫైనలైజ్ అయ్యే అవకాసం ఉందని చెప్తున్నారు. హరీష్ శంకర్ సైతం రీసెంట్ గా ఈ విషయమై దాసరిని కలిసారని చెప్తున్నారు.

ఇవన్నీ చూస్తూంటే...నేను టైమ్ ను నమ్మను..టైమింగ్ ను నమ్మతాను , నేనొచ్చాను టైమే కాదు..టైం టేబుల్ కూడా మారాలి అనే డైలాగులు చెప్పిన పవన్...సెంటిమెంట్స్ ని నమ్మటం విచిత్రంగా ఉందంటున్నారు. అయితే ఫెయిల్యూర్ ఎలాంటి వ్యక్తుల ఆలోచనలు సైతం మారుస్తుంది, అంటున్నారు సిని వర్గాలు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం అలాంటిదేమీ లేదు. క్యాజువల్ గా హిట్ పెయిర్ అనే ఆమెను తీసోకోబోతున్నట్లు చెప్తున్నారు.

English summary
After Gabbar Singh, this will be the second time Shruti will be paired with Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu