»   » ‘మగధీర’ 50 డేస్ తో ‘సింహా’ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది..!

‘మగధీర’ 50 డేస్ తో ‘సింహా’ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రేపు 18 జూన్ అర్థశత దినోత్సవం పూర్తి చేసుకోనున్న'సింహా" చిత్రానికి 50డేస్ సెంటర్స్ లిస్ట్ ని తయారుచేసే పనిలో వున్నారు ఆ చిత్ర అనుచరగణం. అందులో తయారు చేసే పనేముందీ అనుకోకండి. ఉన్న సెంటర్స్ సెలక్ట్ చేయడం తేలికే కానీ..లేని థియేటర్స్ ని కలపడం కష్టమైన పనేగా. 302 కేంద్రాల్లో(ఆంధ్రప్రదేశ్ లోనే 277 డైరెక్ట్ సెంటర్స్) యాభై రోజులు ప్రదర్శింపబడ్డ 'మగధీర" రికార్డ్ ని అధిగమించిందని చూపేలా 'సింహా" అర్థ శతదినోత్సవ కేంద్రాలను ప్రకటించనున్నారని సమాచారం.

అయితే ఇప్పటి వరకూ బాక్సీఫీస్ కలెక్షన్స్ లో భారీ రికార్డుల్నేసృష్టించిన 'సింహా" చిత్రం అర్థశతదినోత్సవ కేంద్రాల పరంగానూ కొత్త చరిత్రను లిఖిస్తుందని భావిస్తున్నారు బాలయ్య అభిమానులు. వేదం, పంచాక్షరి సినిమాలు విడుదల కావడంతో 'సింహా" థియేటర్స్ ఎన్నితగ్గినా మొదట్లో ఒరిజినల్ సెంటర్సే వెల్లడించాలని అనుకున్నప్పటికీ అభిమానుల ఒత్తిడి మేరకే 'సింహా" 50 డేస్ కేంద్రాలను అదనంగా చేర్చాల్సి వచ్చిందంటున్నారు సదరు కార్యవర్గం. అయితే చూద్దాం..అధికారికంగా ప్రకటించే సెంటర్స్ ఎన్నో రేపు తేలగానే ఆపై అసలు అర్థశతదినోత్సవ కేంద్రాలెన్నో కూడా వెలుగులోకి వచ్చి తీరతాయిగా అంటున్నారు ప్రతి వర్గాలు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu