»   » పవన్ కళ్యాణ్.... పిన్ని పాత్రలో హాట్ సింగర్ సునీత?

పవన్ కళ్యాణ్.... పిన్ని పాత్రలో హాట్ సింగర్ సునీత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ సునీత గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. అద్భుతమైన గానామృతంతో పాటు... బ్యూటిఫుల్ లుక్స్ ఆమె సొంతం. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. హీరోయిన్లు అభిమానులు ఉంటారు..కానీ వారిపై అభిమానం తాత్కాలికమే. సింగర్ సునీతకు మాత్రం పర్మినెంట్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.

ఆమెతో సినిమాల్లో నటింపజేయాలని గతంలో చాలా మంది దర్శక నిర్మాతలు ట్రై చేసారు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. అయితే ఆ మధ్య శేఖర్ కమ్ముల ‘అనామిక' చిత్రం ప్రచార గీతంలో మాత్రం అలా మెరిసి ఇలా మాయమైంది. ఎట్టకేలకు సునీత వెండితెరపై కనిపించేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.

Singer Sunitha in Pawan kalyan-Trivikram's film

త్వరలో తివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రాబోయే సినిమాలో ఆమె నటించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. పవన్ కళ్యాణ్ పిన్ని పాత్రలో నటింపజేయడానికి త్రివిక్రమ్ ఆమెను ఒప్పించాడని అంటున్నారు. అత్తారింటికి దారేది చిత్రంలో నదియా పాత్రకు త్రివిక్రమ్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారు.... తన రాబోయే సినిమాలో సునీతకు అదే రేంజిలో ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఒప్పించాడట. అదే నిజమైతే.... సునీత అభిమానులకు పండగే.

English summary
Reportedly Trivikram Srinivas has convinced Singer Sunitha to play the role of 'Pinni' to Pawan Kalyan in their combo film.
Please Wait while comments are loading...