»   »  నాగ్ 'భాయ్‌' కథ ఆ సెంటిమెంట్ తో ...

నాగ్ 'భాయ్‌' కథ ఆ సెంటిమెంట్ తో ...

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : నాగార్జున, రిచా గంగోపాధ్యాయ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'భాయ్‌'. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వీరభద్రమ్‌ చౌదరి దర్శకుడు. ఈ చిత్రం కథ సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతోందని సమాచారం. చెల్లెలుగా జరాఖాన్ నటిస్తోందని తెలుస్తోంది. ఆమె గతంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం లో చేసింది. ఆమె పాత్ర చుట్టూ కథ తిరుగుతుందని చెప్పుకుంటున్నారు.


ఈ చిత్రం ఆగస్టు లో ఆడియోని విడుదల చేసి, వినాయిక చవితికి సినిమా విడుదల చేసే ఆలోచలో ఉన్నట్లు సమాచారం. మరో ప్రక్క 'భాయ్‌' ఓ మళయాళ చిత్రం కాపీ అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. వారు చెప్తున్న ఆ చిత్రం ఏమిటంటే... 2010 లో ముమ్మట్టి,పృథ్వీరాజ్ కాంబినేషన్ లో రూపొంది, ఘన విజయం సాధించిన పొక్కిరి రాజా చిత్రం. ఆల్రెడీ పొక్కిరి రాజా చిత్రాన్ని అక్షయ్ కుమార్...నామ్ భాయ్..బాస్ అనే టైటిల్ తో తెరకెక్కించటానికి రైట్స్ తీసుకున్నారు.

పొక్కిరి రాజా లో కథ...పూర్తి మాస్ మసాలా గా సాగుతుంది. చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయిన కుర్రాడు... సిటీలో డాన్ గా ఎదిగి...తన తమ్ముడుని సేవ్ చేయటానికి తన ఐడింటీటీ బయిట పెట్టకుండా తన ఊరు వస్తాడు. అక్కడ నుంచి జరిగే యాక్షన్ కామెడీ నే సినిమా కథ. ఈ చిత్రంలో శ్రియ హీరోయిన్ గా చేసింది. ముమ్మట్టి లోకల్ డాన్ గా ఫన్ చేస్తూంటాడు. అతని వచ్చి రానీ ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇదే కథను భాయ్ గా చేస్తున్నాడంటున్నారు. అయితే...సినిమా రిలీజైతే కానీ ఏ విషయం తెలియదు.

దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఇరానీ చాయ్‌ గురించీ, పాతబస్తీలో భాయ్‌ గురించీ తెలియని వాళ్లుండరు. మంచి కోసం, మనీ కోసం ఏదైనా చేస్తాడు. కాకపోతే కాస్త మొండిఘటం. ఎవరి మాటా వినడు. బరిలో దిగితే వెనక్కి తిరిగి చూడడం తెలీదు. ఆ వేగమే అతని ఆయుధం. ఇంతకీ భాయ్‌ సిటీకి ఎందుకొచ్చాడు? ఇక్కడ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు వీరభద్రమ్‌.

'భాయ్‌' లో నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా చేస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్ద నిర్మిస్తోంది. ''నాగార్జున పాత్ర, ఆయన పలికే సంభాషణలు మాస్‌కి బాగా నచ్చుతాయి. ఆయన్ని అభిమానులు ఎలా చూడాలనుకొంటున్నారో.. అలానే తీర్చిదిద్దుతున్నాం. త్వరలోనే తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తాము''అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

English summary
Akkineni Nagarjuna’s ‘Bhai’ is currently under production. The movie is carrying good vibes and it is expected to be a comedy entertainer.The film will have a good dose of sister sentiment. Zara Shah, who was seen in ‘Life is Beautiful, will be seen as Nagarjuna’s sister in the movie. Apparently, she has a role that is very crucial for the second half of the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu