»   » మోహన్ లాల్ దగ్గర అన్ని కోట్లు బ్లాక్ అంతుందా.. రుజువులు చూపెడుతున్నారే..ఇప్పుడేం చేస్తారు

మోహన్ లాల్ దగ్గర అన్ని కోట్లు బ్లాక్ అంతుందా.. రుజువులు చూపెడుతున్నారే..ఇప్పుడేం చేస్తారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరువనంతపురం: ఇవి సోషల్ మీడియా రోజులు. ఏమి మాట్లాడినా వెంటనే అనేక వర్గాల నుంచి కొద్ది నిముషాల్లోనే బారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. సామాన్యుల వరకు ఫరవాలేదు కానీ, సెలబ్రెటీలు మరింత జాగ్రత్తగా , కంట్రోల్డ్ గా మాట్లాడాల్సిన పరిస్దితులు.

ముఖ్యంగా విద్య శాతం అధికంగా ఉండి, సోషల్ మీడియా విపరీతంగా వినియోగిస్తున్న కేరళ వంటి చోట మరీను. అందుకనే ఈ మధ్యకాలంలో ప్రతీ సెలబ్రెటీ..సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ ఇదే పరిస్దితి ని ఎదుర్కొంటున్నారు.

రీసెంట్ గా ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'జనతా గ్యారేజ్‌', యేలేటి 'మనం' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌. దేశంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని మలయాళ నటుడు మోహన్ లాల్ తన అభిప్రాయాన్ని కాస్త లేటుగా సోషల్ మీడియా ముఖంగా వ్యక్తం చేసారు. ఆయన ఇదే అంశంపై ఆయన తన సోషల్ నెట్‌వర్క్ సైట్‌లో ఓ పోస్ట్ చేశారు.

స్వాగతించ నిర్ణయం...

స్వాగతించ నిర్ణయం...

చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ మోడీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం స్వాగతించదగ్గ చర్యగా అభివర్ణించారు.
'పాత నోట్లను ఉపసంహరించడాన్ని మంచి సంకల్పంతో చేసిన మెరుపుదాడిగా భావిస్తున్నాను. చెప్పినట్టుగానే ప్రధాని మోడీ పనులు చేస్తున్నారు అన్నారు.

నిజాయితీతో కూడుకున్న

నిజాయితీతో కూడుకున్న

నేను వ్యక్తులను ఆరాధించను. కానీ నిజాయితీగా తమ ఆలోచనలను అమలు చేసే వారిని ఎక్కువగా అభిమానిస్తాను. రూ. 500, రూ. వెయ్యి నోట్లను రద్దు చేయడం నిజాయితీతో తీసుకున్న నిర్ణయమే. ఆరంభంలో నోట్ల కష్టాలు ఎదురైనా భవిష్యత్‌‌లో మనకు మంచి జరుగుతుందని నమ్ముతున్నాను.

అనేక చోట్ల మనం క్యూలలో

అనేక చోట్ల మనం క్యూలలో

అవివేకంతో ఇటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోరని మనం గుర్తించాలి. మద్యం షాపులు, సినిమా థియేటర్లు, ప్రార్థనా స్థలాల్లో మనం క్యూలో నిలబడుతుంటాం. మంచి పని కోసం మనం క్యూలో నిలబడటం వల్ల హాని జరగదని నా అభిప్రాయమ'ని మోహన్‌లాల్‌ పేర్కొన్నారు.

వివాదం అక్కడ మొదలైంది

వివాదం అక్కడ మొదలైంది

అయితే ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చిన సమయంలోనే కేరళలో డబ్బుల కోసం ఏటీఎంల దగ్గర లాంగ్ క్యూల్లో నిలబడి ఇద్దరు ప్రాణాలు వదిలారు. దీంతో జనాలకు మోహన్ లాల్ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. వైన్ షాపుల దగ్గర నిలబడే వారితో ఏటీఎంల నిలబడే వారిని పోల్చడమూ వివాదానికి కారణమైంది.

రద్దు మ్యాటర్ ముందే ...

రద్దు మ్యాటర్ ముందే ...

ప్రస్తుతం ఆయన మీద వస్తున్న ఆరోపణలు ఎంత దారుణంగా ఉన్నాయంటే...మోహన్ లాల్ కు ముందే ఈ నోట్లు రద్దు విషయం తెలుసని సోషల్ మిడియాలో వ్యాఖ్యానిస్తున్నారు కొందరు. ముఖ్యంగా మైనింగ్ విషయంలో ఆయన రీసెంట్ గా చేసిన ఇన్విస్టిమెంట్ విషయం చర్చకు వస్తోంది.

అంత పెట్టాడా

అంత పెట్టాడా

కువైట్ లో ని ఓ మైనింగ్ కంపెనీలో మోహన్ లాల్ మూడు వేల ముడు వందల కోట్లు పెట్టుబడి పెట్టారని అంటున్నారు. అది కూడా ముందుగా ఈ నోట్లు రద్దు విషయం తెలిసే పెట్టుబడి పెట్టారని చెప్పుకుంటున్నారు. దీనిపై చాలా మంంది ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెడుతూ ఆరోపణలు చేస్తున్నారు.

కువైట్ లో ఓ కంపెనీ

కువైట్ లో ఓ కంపెనీ

మోహన్ లాల్ ఈ ఖర్చుతో కువైట్ లో ఓ డ్రిల్లింగ్ కంపెనీ పెట్టాడని అంటున్నారు. ఈ మేరుకు ఓ వీడియో సైతం బయిటకు వచ్చింది. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ విషయమై మళయాళి చిత్ర పరిశ్రమలో సైతం పెద్ద చర్చే జరుగుతోంది.

ఎక్కడ చూసినా ఇదే

ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక ఎట్రాక్షన్ గా మళయాళీలను ఎట్రాక్ట్ చేస్తోంది. అక్కడ మీడియా సైతం ఈవిషయాన్ని హైలెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. కాకపోతే మోహన్ లాల్ కు చెందిన మీడియా వర్గాలు మాత్రం సైలెంట్ గా ఈ క్యాపైన్ ని తిప్పికట్టే పనిలో ఉన్నాయి.

కువైట్ న్యూస్ లో

కువైట్ న్యూస్ లో

ఇక ఈ రచ్చ ఇక్కడితో ఆగలేదు. కువైట్ లోని న్యూస్ ఏజెన్సీలు ఈ న్యూస్ ని హైలెట్ చేస్తూ...ఇండియాకు చెందిన నటుడు తమ దేశంలోని పరిశ్రమలో మూడు వేల మూడు వందల కోట్లు పెట్టుబడి పెట్టారంటూ రాసుకొచ్చాయి. దాంతో మరీ పెద్ద న్యూస్ అయ్యిపోయింది. అల్లరికి దారితీస్తోంది.

ఇదీ బయిటకు వచ్చింది

ఇదీ బయిటకు వచ్చింది

ఇక మోహన్ లాల్ పెట్టిన ఈ బిజినెస్ లో గల్ప్ కు చెందిన స్పీక్ ఆసియా డా.డాన్ ట్రేడింగ్ కంపెనీ, మిస్టర్ ఫిలిప్, కువైట్ కుచెందిన వ్యక్తి పార్టనర్స్ అని అన్నారు. గల్ప్ మీడియా హౌస్ నుంచి ఈ వార్త వచ్చింది.

 ఇన్ కమ్ టాక్స్ దాడి తర్వాత

ఇన్ కమ్ టాక్స్ దాడి తర్వాత

2011 లో మోహన్ లాల్ పై ఇన్ కం టాక్స్ వారు దాడి చేసిన తర్వాత ఆయన తన పెట్టుబడులను విదేశాలకు తరలిస్తున్నారని ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా 3,300 కోట్లను టాక్స్ రెవిన్యూగా అభివర్ణిస్తూ జహంగీర్ అనే అతను ఆరోపణలు చేస్తున్నారు.

అనవసరసంగా...

అనవసరసంగా...

నోట్లరద్దు, నల్లధనం విషయమై నీతులు చెబుతున్న మోహన్ లాల్.. కొన్నేళ్ల కిందట ఐటీ అధికారుల దాడిలో దొరికిపోవడం కూడా ప్రస్దావన వస్తోంది. అలాగే.... నల్లధనం భారీగా దాచి పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కోవడం,ఇప్పుడు 3,300 కోట్లు విషయంతో జనాలు ఈ సూపర్ స్టార్ మీద సోషల్ మీడియాలో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏనుగు దంతాల కేసు

ఏనుగు దంతాల కేసు

గత కొంతకాలంగా ఏనుగుదంతాల కేసు వెంటాడుతోంది. అయితే తాజాగా ఈ కేసుని ఇమ్మీడియట్ గా తేల్చమని, క్విక్ వెరిఫికేషన్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. కోచి కోర్టు శనివారం మోహన్ లాల్ ఏనుగు దంతాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలని విజిలెన్స్‌ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. మోహన్‌ లాల్‌ అక్రమంగా ఏనుగు దంతాలు కలిగి ఉన్నారంటూ హక్కుల కార్యకర్త ఏఏ పౌలాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన మువత్తుపుళా విజిలెన్స్‌ కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నవంబర్‌ 28లోగా దర్యాప్తు నివేదిక తమకు సమర్పించాలని ఆదేశించింది.

పులి మురగన్ డబ్బింగ్

పులి మురగన్ డబ్బింగ్

ఇక మోహన్ లాల్ తాజా చిత్రం ఒకటి తెలుగులో మన్యం పులి టైటిల్ తో డబ్బింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2 న విడుదల చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ విషయమై క్లారిటీ ఇస్తూ ఈ రోజు ప్రకటన వచ్చే అవకాసం ఉంది. మళయాళంలో పెద్ద హిట్టైన ఈ చిత్రం తెలుగులోనూ అంతకు మించి అన్నట్లుగా రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ రైట్స్ తీసుకున్న తెలుగు నిర్మాత సింధూరపు పువ్వు కృష్ణారెడ్డి.

ఒకే నెలలో రెండోది

ఒకే నెలలో రెండోది

మరో ప్రక్క మోహన్ లాల్ , సముతిరాకని, అనుశ్రీ, విమలారామన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం 'ఒప్పం'. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొంది రిలీజైన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని సైతం తెలుగులో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ లోనే ఈ చిత్రం సైతం రిలీజ్ అవుతుంది.

English summary
The blog is written by Mohanlal, is now facing a serious critical notes supporting the ban. Another serious allegations of defamation, such as high spell.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu