»   » ‘బ్రహ్మోత్సవం’: చూడకుండా అడ్డుకునే ప్రయత్నం, ప్రతీకారమా?

‘బ్రహ్మోత్సవం’: చూడకుండా అడ్డుకునే ప్రయత్నం, ప్రతీకారమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇంటర్నెట్, సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది అని ఊరికే అనలేదు. ఇతర అంశాలపై సోషల్ మీడియా ప్రభావం ఏమేరకు ఉందో ఇపుడు మనకు అనవసరం కానీ.... సినిమాలపై మాత్రం తీవ్రంగా ఉంది.

ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఒక సినిమాకు భారీగా ప్రచారం కల్పించవచ్చు. సినిమాపై భారీగా అంచనాలు పెంచి ఓపెనింగ్స్ భారీగా రాబట్టవచ్చు. అది నాణానికి ఒక వైపు మాత్రమే. ఇదే ఇంటర్నెట్, సోషల్ మీడియా నెగెటివ్ గా ఉపయోగించుకుని ఒక సినిమాకు కలెక్షన్లు తగ్గించవచ్చు, వెళ్లే కొంది మంది జనాలను కూడా వెళ్లకుండా వారి మనసు మార్చేయవచ్చు.

తాజాగా విడుదలైన 'బ్రహ్మోత్సవం' సినిమా విషయంలో సరిగ్గా అదే జరుగుతోంది. సినిమా విడుదలకు ముందు నిర్మాతలు ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికగా చేసుకుని సినిమాకు బాగా ప్రచారం నిర్వహించారు. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే సినిమా విడుదలైన తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది.

'బ్రహ్మోత్సవం' ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడం, మహేష్ బాబు హీరోగా నటించడం, చాలా మంది స్టార్స్ ఉండటం లాంటివి ఉండటం వల్ల స్లోగా బిజినెస్ పుంజుకుంటుందని నిర్మాతలు పెట్టుున్న ఆశలు ఫలించేలా లేవు. ఇంతా సోషల్ మీడియా ఎఫెక్టే అని చెప్పక తప్పదు.

social media negative effects on Brahmotsavam

ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాఫ్ ద్వారా ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం తీవ్రంగా జరుగుతోంది. అభిమానులు ఎలాగూ 'బ్రహ్మోత్సవం' చూస్తారు. అయితే సినిమా గట్టెక్కాలంటే వీరు చాలదు. వీరికంటే ఎక్కువ సంఖ్యలో న్యూట్రల్ గా ఉండే ఆడియన్స్, ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమాను ఆదరించాలి.

సినిమా కాస్త అటూ ఇటుగా ఉన్నా....ఇలాంటి న్యూట్రల్ ఆడియన్స్ వీకెండ్, లేదా వీక్ డేస్ లో ఖాళీ సమయం చిక్కినపుడు అలా టైమ్ పాస్ చేయడానికైనా సినిమాకు వెళ్లాలనుకుంటారు. అయితే సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న నెగిటివ్ ప్రచారంతో వీరిని సైతం సినిమా చూకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకు వెళ్లాలంటేనే భయపడేలా ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఈ ప్రచారం బాగా జరుగుతోంది.

ప్రతీకారమా?
ఈ మధ్య కాలంలో హీరోల అభిమానులు ఏదైనా తేడా వస్తే సోషల్ మీడియా వేదికగా చేసుకుని సైబర్ వార్ చేస్తున్నారు. 'బ్రహ్మోత్సవం' సినిమా విడుదల ముందు అదే జరిగింది. 'బ్రహ్మోత్సవం' సినిమాకు థియేటర్లు దొరకకుండా చేస్తున్నారని అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఓ నిర్మాత తన కొడుకు కోసం 'చీప్ పాలిటిక్స్' చేస్తున్నారనే అంశాన్ని బాగా ప్రచారం చేసారు. అయితే ఇపుడు ఆ హీరో అభిమానులకు మంచి అవకాశం దొరికినట్లయింది. దానికి ప్రతీకారంగానే ఆల్రెడీ నెగెటివ్ టాక్ వచ్చిన 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా చేసుకుని మరింత దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

English summary
social media negative effects on Brahmotsavam. Brahmotsavam is a 2016 Indian Telugu-language drama film written and directed by Srikanth Addala which is produced by Prasad V. Potluri under the banner PVP cinema, it features Mahesh Babu, Kajal, Samantha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu