twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాద్ షా’ విడుదలకు స్పెషల్ ముహూర్తం..డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. ఈ చిత్రం ఏప్రియల్ 5 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే రోజు ఉదయం 5.23 నిముషాలకు విడుదల ముహూర్తం ఫిక్స్ చేసారని తెలుస్తోంది. ఇందుకోసం నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యేకంగా పండితులను కలిసి ముహూర్తం పెట్టించారని తెలుస్తోంది.

    ఎన్టీఆర్ హెయిర్‌స్టయిల్ నుంచి పెట్టుకున్న వాచ్, మాట్లాడే ప్రతి మాటా.. ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. బ్రాండెడ్ వేర్‌లో 'లిమిటెడ్ ఎడిషన్' అంటారే... అలా ఈ 'బాద్‌షా' ఓ 'స్పెషల్ పీస్'లాంటిది. ఆరంభం నుంచి శుభం వరకు శ్రీను వైట్ల ఎంతో శ్రద్ధ తీసుకుని చేశారు. మేమందరం గర్వంగా చెప్పుకునే చిత్రం అవుతుంది అంటున్నారు నిర్మాత బండ్ల గణేష్.

    ట్రేడ్ లో ఉన్న సమాచారం బట్టి... ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజిలో జరిగిందని తెలుస్తోంది. సీడెడ్ లో అయితే తొమ్మిది కోట్ల వరకూ పలికిందని తెలుస్తోంది. ముగ్గరు కలిసి ఈ సీడెడ్ ని తీసుకున్నారని సమాచారం. వెస్ట్ గోదావరి... 2 కోట్ల అరవై లక్షలుకు పాలకొల్లు బుజ్జి తీసుకోగా, ఈస్ట్ గోదావరి.. రెండున్నర కోట్లుకు పైగా తీసుకున్నారని చెప్తున్నారు. వైజాగ్ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. అక్కడ గట్టి పోటీ ఉండటంతో ఇంకా ఏదీ ఖరారు చేయలేదు. నైజాం లో కూడా పదికోట్లకు పైగా పలుకుతోంది. దిల్ రాజు తీసుకున్నట్లు చెప్తున్నారు. గుంటూరు,నెల్లూరు కలిపి ఐదు కోట్లు పైచిలకు వెళ్లిందనేది టాక్. ఇలా విడుదలకు ముందు అన్ని రైట్స్ కలిపి యాభై నాలుగు కోట్ల వరకూ బిజినెస్ చేస్తోందని చెప్పుకుంటున్నారు.

    అయితే బండ్ల గణేష్ మాత్రం ఆచి తూచి బిజినెస్ విషయంలో అడుగులు వేస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించి శాటిలైట్ రైట్స్ ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది. అయితే ఓ ధర్డ్ ఫార్టీ ఈ రైట్స్ ని కొనుగోలు చేసిందని సమాచారం. ఆ రేటు ఏడు కోట్ల యాభై లక్షలు పలికిందని తెలుస్తోంది. ధర్డ్ పార్టీ వారు తర్వాత మరో రేటుకు టీవీ ఛానెల్స్ కు అమ్ముకుంటారు. ఇప్పటికే ఈ చిత్రం హక్కులు దక్కించుకునేందుకు రెండు పాపులర్ టీవీ ఛానల్స్ పోటీ పడుతున్నాయి. దాంతో మధ్యరకంగా ఈ రేటుకి ఫిక్స్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

    ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    producer Bandla Ganesh even fixed a muhurtham for NTR's Baadshah release. Brahmin pundits reportedly suggested him to release 'formally' on the auspicious muhurtham of 5.23 am early morning hour on April 5th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X