For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రామ్ చరణ్ 'రచ్చ' లో మరో సెన్సేషన్ ...

By Srikanya
|

రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చలో ...చిరంజీవి నటించిన గ్యాంగ్‌లీడర్ లోని ఓ పాటను రీమిక్స్ చేస్తున్నారని బయట ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అటువంటి ప్రయత్నమేమీ జరగలేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఓ స్టార్ హీరోయిన్ తో సర్‌ప్రైజ్‌గా స్పెషల్‌సాంగ్ చేయించాలనే ఆలోచన దర్శక, నిర్మాతల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఆమె మరెవరో కాదు కాజల్ అని చెప్తున్నారు.ఇక

ఆరంజ్ లో లవర్‌బాయ్‌గా కనిపించిన రామ్‌చరణ్ వెంటనే తన పంథా మార్చి మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. అదే రచ్చ సినిమా. ఏమైంది ఈ వేళ తో ప్రతిభావంతుడైన దర్శకునిగా పేరు తెచ్చుకున్న సంపత్‌నంది ఈ చిత్రానికి దర్శకుడు. మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పారాస్‌జైన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్నా ఇందులో హీరోయిన్ గా చేస్తోంది.. శ్రీలంక, బ్యాంకాక్‌ల్లో ఇప్పటికే భారీ షెడ్యూల్స్ చేశారు.

ఇటీవలే గోవాలో హీరో ఇంట్రడక్షన్ ఫైట్‌ని, భారీ ఛేజ్‌ని నాలుగు రోజులపాటు చిత్రీకరించారు. ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూలు జరగనుంది. ఇప్పటికే అరవైశాతం చిత్రం షూటింగ్ పూర్తయింది. ముగ్గురు ఫైట్‌మాస్టర్లు ఈ చిత్రానికి పనిచేస్తుండటం విశేషం. అమీన్, స్టన్ శివ, రామ్లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. చిరుత తర్వాత చరణ్ సినిమాకు మణిశర్మ స్వరాలందిస్తున్నారు. ఇందులో మొత్తం ఆరు పాటలుంటాయి. రచ్చ కోసం చరణ్ ప్రత్యేకంగా మియామి వెళ్లి ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమా గెటప్, డాన్సులు, ఫైట్‌ల విషయంలో కూడా చరణ్ ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. పరుచూరి బ్రదర్స్‌లాంటి అనుభవజ్ఞులైన రచయితలతో చరణ్ కలిసి పనిచేయడం ఇదే ప్రథమం. ఈ కథ విషయంలో చిరంజీవి కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. రచ్చ ను సంక్రాంతికి విడుదల చేయాలనేది నిర్మాతల ప్లాన్ చేస్తున్నారు.

ఇక రచ్చ దర్శకుడు సంపత్ నంది గురించి చెపుతూ..నేను చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను..అలాంటి పాత్రను నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. నా ఫ్యాన్స్ నానుంచి ఎలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేస్తారో ఖచ్చితంగా అలాంటిదే ఇది. ఈ స్క్రిప్టుని సంపత్ నంది చాలా జాగ్రత్తగా వర్క్ చేసి తెరకెక్కిస్తున్నారు. అతను చాలా ప్రతిభావంతంగా పనిచేస్తున్నాడు అన్నారు. ఇక రచ్చ చిత్రాన్ని క్రిసమస్ కానుకగా విడుదల చేయాలని రామ్ చరణ్ చెప్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.

English summary
"Rachcha" will set an example for Tollywood of how a movie can be made with low production costs and high cinematic value. "Once the film is done, we would like to reveal all the production costs and people can see for themselves," Ram Charan says.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more