»   »  డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల నెక్ట్స్ చిత్రం ఖరారు, డిటేల్స్

డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల నెక్ట్స్ చిత్రం ఖరారు, డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బ్రహ్మోత్సవం చిత్రం డిజాస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కెరీర్ డైలమోలో పడిన సంగతి తెలిసిందే. చిన్న హీరోలు సైతం ఆయనతో పనిచేయటానికి ఆసక్తి చూపటం లేదు. ఫ్లాఫ్, హిట్ అనేదాని కన్నా సినిమా బోరింగ్ నేరేషన్ వారిని భయపెడుతోంది. ఈ నేపధ్యంలో శ్రీకాంత్ తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం...ఓ సింపుల్ లవ్ స్టోరీ ని తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇది తన సెకండ్ ఇన్నింగ్స్ గా భావించి, కొత్త బంగారు లోకం తరహాలో చిన్న సినిమా....పెద్ద హిట్ తో ముందుకు వచ్చి ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Srikanth Addala

ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడని సమాచారం. దిల్ రాజు గతంలో శ్రీకాంత్ అడ్డాలతో కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు నిర్మించారు. అదే అనుబంధంతో తన క్యాంపస్ నుంచి బయిటకు వచ్చిన శ్రీకాంత్ అడ్డాల కష్టకాలంలో ఆదుకోవాలని నిర్ణయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఓ కథ ఫైనల్ అయ్యిందని, ప్రస్తుతం స్క్రిప్టు దశలో ఉన్న ఈ ప్రాజెక్టు అతి త్వరలోనే ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. బ్రహ్మోత్సవం కు ముందే దిల్ రాజుతో శ్రీకాంత్ అడ్డాల సినిమా చేస్తాడని అంతా భావించారు. అయితే అప్పుడు రెమ్యునేషన్స్ వద్ద ప్లాబ్లం వచ్చి ఆగిందని తెలుస్తోంది. అయితే ఈ సారి శ్రీకాంత్ అడ్డాల...బ్రహ్మోత్సవం ను అందరూ మర్చిపోయే చిత్రం చేయాలని నిర్ణయించుకునే ముందుకు వెళ్తున్నారని సమాచారం.

English summary
With the disaster called Brahmotsavam ...Srikanth Addala is now planing a simple love story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu