»   » 'శ్రీమంతుడు' : ఆడియో లాంచ్ మొత్తం 120 సెకండ్లులలో (వీడియో)

'శ్రీమంతుడు' : ఆడియో లాంచ్ మొత్తం 120 సెకండ్లులలో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు హీరోగా నటించిన 'శ్రీమంతుడు' పాటల విడుదల వేడుక మొన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఆ లాంచ్ లోని కొన్ని విలువైన భాగాలను మహేష్ అభిమాని ఒకరు ఇదిగో ఇలా ఎడిట్ చేసి అందిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు అందరి అభిమానులను ఆనందింపచేస్తోంది. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.మీరూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో షేర్ చేయండి.

Srimanthudu Grand Audio Launch Event in 120 seconds made by a Fan! Check it out!


Posted by Mythri Movie Makers on 21 July 2015

అలాగే ఈ చిత్రంలోని చారుశీల సాంగ్ ప్రోమోను సైతం చూడండిఇక శ్రీమంతుడు కొత్త విశేషాలు..


'వూరు దత్తత' అనే అంశానికి నరేంద్ర మోదీ ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఆయనకు ఈ చిత్రం బాగా నచ్చుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది. వీలైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసమూ ఓ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకొంటున్నారట.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అలాగే ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్‌రావులకు ప్రత్యేకంగా ప్రదర్శించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. వూరిని దత్తత తీసుకోవాలనే ఓ చక్కటి సందేశం చుట్టూ సాగే కథ ఇది. శ్రుతి హాసన్‌ హీరోయిన్ గా చేస్తోంది. కొరటాల శివ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.


చిత్రం కాన్సెప్టు ఏమిటీ అంటే....వూరు చాలా ఇచ్చింది. అందమైన బాల్యాన్ని, మర్చిపోలేని స్నేహాన్నీ, వదులుకోలేని జ్ఞాపకాల్ని. ఇన్నిచ్చిన వూరుకి తిరిగి ఏమిచ్చాం..? రెక్కలొచ్చి వెళ్లిపోయాక.. పండగలకీ పబ్బాలకీ సొంతూరెళ్లి - మహా అయితే సెల్ఫీ దిగొచ్చాం. అంతేగా..? అందుకే.. 'వెలకట్టలేని ఆస్తిని ఇచ్చిన వూరికి మనమూ ఏదోటి తిరిగివ్వాలి..' అని చెప్పడానికి 'శ్రీమంతుడు' వస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలయ్యాయి.


మహేష్‌బాబు మాట్లాడుతూ...


'Srimanthudu' :Grand Audio Launch Event in 120 seconds

''అభిమానులు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. వాళ్ల కోసం మంచి సినిమాలు చేసేందుకే ప్రయత్నిస్తుంటా. పోయినసారి కాస్త నిరుత్సాహపరిచాను. అందులో నా తప్పుంటే క్షమించండి''అన్నారు మహేష్‌బాబు.


''అన్నయ్య వెంకటేష్‌గారికి కృతజ్ఞతలు. ఈ వేడుకకి వచ్చిందుకు. దేవి అంటే నాకు చాలా ఇష్టం. 'జాగో జాగో...' పాట నా కెరీర్‌లోనే ఉత్తమ గీతంగా నిలుస్తుంది. కొరటాల శివ అద్భుతమైన రచయిత. నాకు చెప్పినదానికంటే బాగా తీశాడు. 'శ్రీమంతుడు' లాంటి సినిమా నాతో తీసినందుకు కృతజ్ఞతలు.


ఈ సినిమా ఒప్పుకొన్నందుకు జగపతిబాబుగారికి కృతజ్ఞతలు. ఆయన తప్ప మరొకరు సెట్‌ అవ్వని పాత్ర అది. రాజేంద్రప్రసాద్‌గారు, సుకన్యగారు, రాహుల్‌ రవీంద్రన్‌ లాంటి నటులతో కలసి నటించడం చక్కటి అనుభవం. కమల్‌ హాసన్‌గారికి పెద్ద అభిమానిని. ఆయన కూతురితో కలసి సినిమా చేస్తాననుకోలేదు. అభిమానులు ఈసారి నా పుట్టినరోజుకి పెద్ద కానుక ఇస్తారని ఆశిస్తున్నాను''అన్నారు.


దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ...


''మహేష్‌ లాంటి ఓ గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం ఇంత తొందరగా రావడం నా అదృష్టం. మహేష్‌ ఇమేజ్‌కి నాలుగు ఫైట్లు, పాటలు ఉంటే సరిపోదు. ఒక పెద్ద కాన్వాస్‌లో కథ ఉండాలని కష్టపడి రాశా. మహేష్‌గారికి చెప్పినప్పుడు 'ఈ కథని ఇంత కమర్షియల్‌గా చెప్పొచ్చా?' అని ఆశ్చర్యపోయారు. మహేష్‌తో ఈ సినిమా తీయడం ఆనందంగా ఉంది. మహేష్‌, జగపతిబాబు తండ్రీకొడుకులుగా బాగా కుదిరారు''అన్నారు.


శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ... ''ఇలాంటి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో మరిచిపోలేని పాత్ర పోషించాను''అన్నారు.


వెంకటేష్‌ మాట్లాడుతూ... ''ట్రైలర్‌ చూశాక నేను రెండు సైకిళ్లు కొని ప్రాక్టీస్‌ చేసి తొక్కాను. ఆ సైకిల్‌పై నేను రఫ్‌గా కనిపిస్తా. మా చిన్నోడు అందంగా కనిపించాడు. అదెందుకో మనందరికీ తెలుసు. 'శ్రీమంతుడు' చూశాక మనందరికీ దిమ్మతిరిగిపోద్ది. రికార్డులు బద్దలవుతాయు''అన్నారు.

English summary
Srimanthudu Grand Audio Launch Event in 120 seconds made by a Fan! Check it out! If all goes well the upcoming big release Srimanthudu would have a private screening to Prime Minister Narendra Modi.
Please Wait while comments are loading...