twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీనువైట్ల రెమ్యూనరేషన్ గొడవ.. మిస్టర్ విషయంలో అసలేం జరిగింది!

    By Rajababu
    |

    వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న దర్శకుడు శ్రీనువైట్ల 'మిస్టర్' చిత్రంతో మళ్లీ టాప్ రేంజ్‌కు చేరుకోవాలనుకొన్నారు. కానీ మిస్టర్ చిత్రం రొటీన్ కథ, కథనంతో తెరకెక్కడం, అంతేకాకుండా శ్రీనువైట్ల సినిమాలో బలంగా భావించే హస్యం తేలిపోవడంతో బాక్సాఫీస్ వద్ద మిస్టర్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకొని రూపొందించిన మిస్టర్ కూడా పడకేయడంతో మళ్లీ ఆగడు సినిమా తర్వాత ఉన్న పరిస్థితే శ్రీనువైట్లకు ఎదురైంది. అయితే మిస్టర్‌ సినిమాకు సంబంధించి శ్రీను వైట్లకు చెందిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    రెమ్యూనరేషన్ నో..

    రెమ్యూనరేషన్ నో..

    వివిధ కోణాలున్న మిస్టర్ కథను నిర్మాతలకు ఒప్పించిన తర్వాత ఆ చిత్రానికి రెమ్యూనరేషన్ తీసుకోనని చెప్పినట్టు సమాచారం. తన రెమ్యూనరేషన్ మొత్తం కింద మిస్టర్‌ను చాలా లావిష్‌గా తెరకెక్కించాలనే కోరికన నిర్మాతల ముందు పెట్టినట్టు సమాచారం. సినిమా సూపర్ హిట్ అయితే వచ్చే లాభాల్లో తన పారితోషికాన్ని తీసుకొంటాను అనే ప్రపోజల్ ముందు పెట్టడం, ఆ ప్రతిపాదన నిర్మాతలకు కూడా నచ్చడం మిస్టర్ సినిమా నిర్మాణానికి బీజం పడినట్టు సమాచారం.

    ఫారిన్ లొకేషన్లు..

    ఫారిన్ లొకేషన్లు..

    ఆ క్రమంలో తన కథకు న్యాయం చేసే క్రమంలో నిర్మాతలను లెక్కకు మంచి ఖర్చు పెట్టించినట్టు తెలిసింది. అంతేకాకుండా స్పెయిన్, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మంచి లోకేషన్లలో షూటింగ్ జరిపారు. సినిమాలో లెక్కకు మించిన క్యారెక్టర్లు, నటీనటుల సంఖ్య కూడా భారీగానే కనిపించింది. ఆ విధంగా నిర్మాణ వ్యయం తడిసి మోపడైనట్టు తెలుస్తున్నది. తాజాగా మిస్టర్‌పై ఆర్థికంగా ఆశాజనకమైన ఫలితాలు రాకపోవడం నిర్మాతలను షాక్ గురిచేసినట్టు తెలుస్తున్నది.

    అసలేం జరిగింది..

    అసలేం జరిగింది..

    దర్శకుడు శ్రీనువైట్ల రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేశాడనే రూమర్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. అయితే శ్రీను వైట్ల ప్రతిపాదన నిజమా? నిర్మాతలు అందుకు అంగీకరించారా? శ్రీను వైట్ల ఎందుకు అలాంటి ప్రతిపాదన పెట్టాల్సి వచ్చింది అనే ప్రశ్నలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. హిట్ల మీద హిట్లు ఇచ్చిన శ్రీను వైట్లపై ఇలాంటి రూమర్లు రావడంపై సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకట్రెండు ఫ్లాపులు పడితే దర్శకుడిలో సత్తా తగ్గుతుందా అనే వాదనను కొందరు వినిపిస్తున్నారు.

    మరోసారి చుక్కెదురు..

    మరోసారి చుక్కెదురు..

    మిస్టర్ నిర్మాతలు ఇటీవల సాయి ధరమ్ తేజ్‌తో తీసిన విన్నర్ చిత్రం కూడా మోస్తరు కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. మిస్టర్ చిత్రమైనా లాభాలను తెచ్చిపెడుతుందని ఆశించిన నిర్మాతలకు నిరాశే మిగిలినట్టు తెలుస్తున్నది. కథలేకుండా క్రేజీ కాంబినేషన్, అందమైన ఫారిన్ లొకేషన్లతో సినిమాలు తీస్తే పరిస్థితి ఇలానే ఉంటుందనే వాదన గిట్టనివారి నుంచి వినిపిస్తున్నది.

    English summary
    After Mister movie's flop talk, a interesting news viral in the Industry. Director Srinu Vaitla has not taken single paisa from producers for mister. Srinu Vaitla asked to spend his remuneration for production. What Idea sir jee..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X