twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చరణ్ మళ్లీ పోలీస్ డ్రస్ లో...: నిజం ఏంటి??

    By Srikanya
    |

    హైదరాబాద్: రామ్ చరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్లో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఓల్డ్ సిటీలో శర వేగంగా జరుగుతోంది. అక్కడ లొకేషన్ కు సంభిందించిన ఫొటో మీరు ఇక్కడ చూస్తున్నది. ఈ ఫొటోలో రామ్ చరణ్ ..పోలీస్ డ్రస్ లో ఉన్నారు. గతంలో రామ్ చరణ్ తుఫాన్ లో పోలీస్ డ్రస్ వేసారు. మళ్లీ పోలీస్ డ్రస్ ఏంటి అని అభిమానులు కంగారుపడుతున్నారు.

    అయితే నిజం ఏమిటంటే...రామ్ చరణ్ ఈ చిత్రంలో స్టంట్ మ్యాన్ గా చేస్తున్నారు. కథలో భాగంగా ఓ హీరోకు బాడీ డబుల్ గా రామ్ చరణ్ చేస్తారు. అప్పుడు ఓ కీలకమైన ఫైట్ జరుగుతుంది. అందుకోసమే పోలీస్ డ్రస్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇక ఈ చిత్రానికి ఇప్పటి వరకు టైటిల్ ఖరారు కాలేదు. రోజుకో టైటిల్ ప్రచారంలోకి వస్తోంది. మీడియాలో రకరకాల టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే.. ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ గత కొంత కాలంగా ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ‘బ్రూస్ లీ' అనే టైటిల్ కూడా ప్రచారంలో కి వచ్చింది. అలాగే ఇప్పుడు సుప్రీమ్ అనే టైటిల్ వినపడుతోంది. చిరంజీవికి,రామ్ చరణ్ కు ఈ టైటిల్ నచ్చిందని, ఈ టైటిలే ఫైనలైజ్ చేసే అవకాసం ఉందని సమాచారం. గతంలో చిరంజీవిని సుప్రీం స్టార్ అని పిలిచిన విషయం గుర్తుండే ఉండి ఉంటుంది.

    Srinu vytla movie – Is Ram Charan playing police??

    నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ నేటి నుంచి (3 rd జూన్) హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో నాయికగా 'రకుల్ ప్రీత్ సింగ్' రాంచరణ్ సరసన తొలిసారిగా నటిస్తున్నారు.

    ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ గత నెల 21 నుంచి 30 వరకు మెగాపవర్ స్టార్ 'రాంచరణ్', రకుల్ ప్రీత్ సింగ్ ల పై 'యూరప్' లో పాటల చిత్రీకరణ జరిగింది. తిరిగి ఈరోజు (జూన్ 3 ) నుంచి హైదరాబాద్ లో చిత్రం షూటింగ్ జరుగుతోంది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో పాటు కృతి కర్బంద, తనికెళ్ళ భరణి, రావురమేష్, పవిత్రలోకేష్, సప్తగిరి, రవిప్రకాష్ ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని తెలిపారు

    ‘నాయక్' తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.

    డైరెక్టర్ 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ ‘ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం పై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

    నటీ,నట వర్గం: రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం, నదియ, కృతి కర్బంద, తనికెళ్ళ భరణి, ముఖేష్ రుషి, రావురమేష్, షాయాజీ షిండే, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజి, పృథ్వి, సప్తగిరి, కారుమంచి రఘు, రవిరాజ్, సత్య, రవిప్రకాష్, సురేఖావాణి, పవిత్రలోకేష్, కష్మీరష తదితరులు. ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, సంగీతం; తమన్ ఎస్.ఎస్., కెమెరా: మనోజ్ పరమహంస, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, స్టంట్స్: అనల్ అరసు. లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్ సమర్పణ : డి. పార్వతి నిర్మాత : దానయ్య డి.వి.వి. మూలకథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : శ్రీను వైట్ల.

    English summary
    The other day while shooting in Old City, Charan actually got dressed in a police dress. This is career ninth film of Ram Charan and is likely to hit cinemas on October 15th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X