For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR కోసం మహేష్ బాబుతో రాజమౌళి మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ప్రభాస్ హ్యాండ్ ఇచ్చినా.. మాట తప్పని ప్రిన్స్!

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు తెరపైకి వస్తాయి అని ఒక నమ్మకం అయితే ఏర్పడుతోంది. అంతేకాకుండా హీరోల మధ్య లో ఇలాంటి స్నేహాలు కొనసాగుతాయి అనే విషయంలో కూడా ప్రేక్షకులకు క్లారిటీ కూడా వస్తుంది అని అర్థమవుతుంది. ముఖ్యంగా RRR సినిమాతో ఒక సరికొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మహేష్ బాబుతో దర్శకుడు రాజమౌళి ఒక స్పెషల్ ప్లాన్ చేసినట్లుగా సమాచారం. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఉంటుంది అని తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..

  షాక్ అవ్వాల్సిందే..

  షాక్ అవ్వాల్సిందే..

  తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది RRR సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఎవరైనా సరే షాకవ్వాల్సిందే. మొదటి రోజు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో టికెట్ రేట్లు ఊహించిన దానికంటే ఎక్కువగానే పెరిగినప్పటికీ కూడా ప్రేక్షకులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా టికెట్లను కొనుగోలు చేస్తున్నారు.

  భాషకు తగ్గట్టుగా..

  భాషకు తగ్గట్టుగా..

  ఇక దర్శకుడు రాజమౌళి తన ఇద్దరు హీరోలతో కలిసి గత పది రోజులుగా చేస్తున్న ప్రమోషన్స్ అయితే మామూలుగా లేవు అని చెప్పాలి. గ్యాప్ లేకుండా రోజు ఏదో ఒక విషయం తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. రెగ్యులర్ గా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం ఇలా భాష కు తగ్గట్టుగా ఇంటర్వ్యూలు అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

  హీరోల స్నేహం..

  హీరోల స్నేహం..

  ముఖ్యంగా తెలుగులో అయితే ఏ మాత్రం తగ్గకుండా గత వారం రోజులుగా ప్రతీ రోజు ఏదో ఒక ఇంటర్వ్యూ వీడియో అయితే వదులుతున్నారు. ఇక రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూలతో వారి స్నేహాన్ని ఇంకా బలపరచుకొంటున్నారు అనే చెప్పాలి. అభిమానుల్లో కూడా వారి స్నేహంపై చాలా క్లారిటీ వచ్చేసింది. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా సరదాగా ఉంటారని అర్థమవుతోంది. దానికితోడు రాజమౌళితో కూడా వారి బంధం ఏ విధంగా కొనసాగింది అనే విషయం కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది.

  సరికొత్త ట్రెండ్

  సరికొత్త ట్రెండ్

  తెలుగు చిత్ర పరిశ్రమకు RRR సినిమా మాత్రం ఒక కొత్త ట్రెండ్ అనే చెప్పాలి. మొన్నటివరకు అగ్ర హీరోలు ఎవరు కూడా ఈ స్థాయిలో భారీ మల్టీస్టారర్ సినిమా చేసింది లేదు. ముఖ్యంగా మెగా నందమూరి కలయిక అనగానే ఇండస్ట్రీలో ఒక హై వోల్టేజ్ వైబ్రేషన్స్ వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ కలయిక వెండితెరపై అద్భుతంగా ఉంటుందని అలాగే రియల్ లైఫ్లో కూడా వారి స్నేహం చాలా స్వచ్ఛంగా ఉంది అని అర్ధమైపోయింది.

  మహేష్ తో ప్లాన్?

  మహేష్ తో ప్లాన్?

  అయితే నిత్యం ఏదో ఒక ఇంటర్వ్యూ ఈ సినిమాతో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు తో కూడా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. అసలైతే ఈ సినిమాకంటే ముందే మహేష్ బాబు తో ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడే చేస్తే బాగుండదు అని సినిమా విడుదల తర్వాత సక్సెస్ సందర్భంగా మహేష్ సినిమాను చూసి ఇంటర్వ్యూ చేస్తే మరొక లెవెల్ లో ఉంటుంది అని రాజమౌళి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

  Recommended Video

  Mahesh Babu Ss Rajamouli Movie Genre Revealed | బాబు ఫ్యాన్స్ గెట్ రెడీ..!! || Filmibeat Telugu
  ప్రభాస్ తో క్యాన్సిల్..?

  ప్రభాస్ తో క్యాన్సిల్..?

  మహేష్ బాబు కంటే ముందు రెబల్ స్టార్ ప్రభాస్ తో కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నారు. కానీ ప్రభాస్ గాయం కారణంగా సర్జరీ కోసం ఇటలీ వెళ్లిపోయినట్లు గా తెలుస్తోంది. ఇక ప్రభాస్ అయితే అప్పట్లో ఇండియాకు వచ్చేలా లేడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు కు ప్రత్యేకంగా స్పెషల్ షో చూపించి రాజమౌళి ఇద్దరు హీరోలతో ఇంటర్వ్యూలో ప్లాన్ చేసినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో గాని ఒకవేళ నిజమైతే ముగ్గురు హీరోల అభిమానులకు కనుల విందుగా ఉంటుందని చెప్పవచ్చు.

  English summary
  SS Rajamouli planing for interview on ram charan jr ntr with mahesh babu hosting..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X