RRR Digital And Satellite రైట్స్ డీల్ మరో సంస్థకి.. ఇండియన్ సినీ చరిత్రలో బిగ్గెస్ట్!

మెగా పవర్​స్టార్ రామ్​చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. సినిమా ప్రారంభం నుంచి ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లకు గానూ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే

బాహుబలి క్రేజ్

బాహుబలి క్రేజ్


తెలుగు సినిమా సత్తాను కేవలం భారతదేశానికి మాత్రమే కాదు.. ప్ర‌పంచానికి తెలియ‌జెప్పిన సినిమా ఏదయినా ఉంటే అది బాహుబలి అని చెప్పక తప్పదు. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ.2400 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించి ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీకి అప్పట్లో పెను షాకిచ్చింది.

రిలీజ్ డేట్ ఆరోజునే

రిలీజ్ డేట్ ఆరోజునే


ఈ దెబ్బతో దీంతో ఇప్పుడు రాజ‌మౌళి చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే రాజ‌మౌళి టాలీవుడ్ టాప్‌ హీరోలు అయిన న్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఎప్పుడో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. అక్టోబ‌ర్ 13న ప్రపంచ వ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)'ను విడుద‌ల చేస్తామని నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా క్లారిటీ ఇచ్చారు.

ముందే కొనుక్కున పెన్ స్టూడియోస్

ముందే కొనుక్కున పెన్ స్టూడియోస్

నిజానికి ఈ సినిమా నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు భారీ మొత్తానికి అమ్ముడ‌య్యాయ‌ని అంటున్నారు. నిజానికి ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ సంస్థ పెన్ స్టూడియోస్ వారు దక్కించుకున్నట్లు అధికారికంగా కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. జయంతి లాల్ గడ ఆధ్వర్యంలోని పెన్ స్టూడియోస్ సంస్థ 'ఆర్.ఆర్.ఆర్' నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా అన్ని భాషల్లో ఎలక్ట్రానిక్ - డిజిటల్ - శాటిలైట్ హక్కులు తీసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

జీ సంస్థకు ట్రాన్స్‌ఫర్

జీ సంస్థకు ట్రాన్స్‌ఫర్


తాజాగా అందుతున్న సమాచారం మేరకు ప్ర‌ముఖ జీ స్టూడియోస్ సంస్థ 'ఆర్ఆర్ఆర్‌' శాటిలైట్, డిజిటల్ హక్కులను రూ.325 కోట్లకు కోనుగోలు చేసింది. ఇంతకు ముందు పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ కొనుకున్న నాన్ థియేట్రికల్ హక్కులను జీ సంస్థకు ట్రాన్స్‌ఫర్ చేశారని అంటున్నారు.

Recommended Video

Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
900 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

900 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్


తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ రైట్స్ 165 కోట్లుగా చెబుతున్నారు. ఇక నైజాం ఏరియా 75 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈ విధంగా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు 48 కోట్లు, కర్ణాటక 45 కోట్లు, కేరళ 15 కోట్లునార్త్ కి సంబంధించి 175 కోట్లు బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. ఇక ఓవర్సీస్ లో 70 కోట్లకు ఆర్ఆర్ఆర్ రైట్స్ అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు. ఇక డిజిటల్ రైట్స్ 170 కోట్లు, శాటిలైట్ రైట్స్ 130 కోట్లు, మ్యూజిక్ రైట్స్ కు 20 కోట్లు ఈ సినిమా సాధించినట్టు చెబుతున్నారు. అలా మొత్తం 890 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంటున్నారు. ఇప్పటి దాకా మరో సినిమా ఏదీ ఈమేర బిజినెస్ చేయలేదని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X