»   » లీడర్ రాణా నెక్ట్స్ ఆ స్టార్ డైరక్టర్ తో ..?

లీడర్ రాణా నెక్ట్స్ ఆ స్టార్ డైరక్టర్ తో ..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రాణా తదుపరి చిత్రం ఏ దర్శకుడుతో చేయబోతున్నాడనేది ఇండస్ట్రలో చర్చనీయాంశమైంది. అలాగే రాణా తండ్రి సురేష్ బాబు...జాగ్రత్తగా ప్లాన్ చేసి కెరీర్ ను నడిపించటానికి అనువుగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు తగినట్లుగానే కమర్షియల్ గా హీరోలను ప్రెజెంట్ చేయటంలో పేరున్న దర్శకుడు పూరీ జగన్నాధ్ ని ఈ చిత్రానికి దర్శకుడుగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనతో చర్చలు జరిపారని చెప్తున్నారు. పూరీ జగన్నాధ్ కూడా లీడర్ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా చూసి రాణాతో పనిచేయటానికి ఉత్సాహాన్ని చూపెడుతున్నారని వినపడుతోంది. మహేష్ బాడీ లాంగ్వేజ్ కు తగినట్లుగా పోకిరినీ రూపొందించినట్లు పూరీ రాణాకు సరైన కథ వినిపిస్తానని చెప్పినట్లు అన్నారుట. ఇక ప్రసుతం రాణా..రమేష్ సిప్పీ తో దమ్ మారో దమ్ అనే హిందీ చిత్రం చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్ హీరోగా చేసే ఈ చిత్రం గోవా డ్రగ్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. హాలీవుడ్ హిట్ ట్రాఫిక్ ఆధారంగా ఈ చిత్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ గోపీచంద్ హీరోగా గోలీమార్ చిత్రం రూపొందిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా కనపడనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu