twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాధేశ్యామ్ కథ లీక్.. ఆ మిస్టరీ ట్రైన్ ఆధారంగానే కథ.. టైం ట్రావెల్ నేపథ్యంలో అంతా?

    |

    ప్రభాస్, పూజ హెగ్డే కాంబినేషన్ లో రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా గురించి దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. సాహో సినిమా తరువాత ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా కథ ఒక మిస్టరీ ట్రైన్ ఆధారంగా తెరకెక్కుతోంది అని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

     దాన్ని ఆధారంగా చేసుకుని

    దాన్ని ఆధారంగా చేసుకుని

    రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించనున్నారనీ అలా అని ఈ సినిమా బయోపిక్ కాదనీ అంటున్నారు. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు మొదలైన వాటిని చూస్తే సినిమా మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటలీలో మిస్ అయిన ఒక మిస్టరీ రైలుకి, ఈ సినిమా కధకి సంబంధం ఉందని అంటున్నారు.

    ఎక్కువగా రైలు

    ఎక్కువగా రైలు

    ఎందుకంటే సినిమా నుంచి విడుదలై పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్ ని చూస్తే ఎక్కువగా మనకి రైలు కనబడుతోంది. ఆ మధ్య టీజర్ విడుదలయిన తర్వాత సోషల్ మీడియాలో జానేటి ట్రైన్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు అనే ప్రచారం వైరల్ అయ్యింది. ఇది ఒక హాక్స్ థియరీ ప్రకారం ఉందని ఈ రైలు 106 మంది పాసింజర్లని తీసుకు వెళుతుంటే 1911 సమయంలో మాయమైపోయి గతంలోకి వెళ్లిపోయిందనేది ప్రచారం.

    ఉన్న ఫలంగా మాయమై

    ఉన్న ఫలంగా మాయమై

    106 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ రైలు ఒక గుహలో వెళ్ళగానే ఉన్న ఫలంగా మాయమైపోయింది. 1911లో ఈ ఘటన జరిగింది. అయితే ఇటలీలో మిస్ అయిన ఈ రైలు చాలా విభిన్నమైన పరిస్థితుల్లో మెక్సికో లో కనిపించింది. ఇందులో అసలు పెద్ద వింత ఏమిటంటే అప్పటికి ఇటలీకి మెక్సికోకి రైలు మార్గం లేదు, ఇంకో వింత ఏమిటంటే ఆదిత్య 369 సినిమా టైపులో ఆ రైలు 1911లో మాయమై 1845లో ప్రత్యక్షం అయ్యారు. అందులో ప్రయాణీకులని మెక్సికో అధికారులు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నిస్తే.. ఇటలీ అని చెప్పారు. దీంతో వాళ్ళందరనీ పిచ్చోళ్ళని భావించి మెంటల్ హాస్పిటల్ కి తరలించారు.

    ఇప్పటికీ మిస్టరీగానే

    ఇప్పటికీ మిస్టరీగానే


    ఇప్పటికీ ఈ కథ మిస్టరీగానే ఉండిపోయింది. ఈ కథను బేస్ చేసుకునే 'రాధేశ్యామ్‌' సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాలలో పిరియాడిక్ లవ్ స్టోరీ అని చెబుతున్నారు కానీ సినిమా జోనర్ ఏమిటి? అనే విషయం మీద ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు. ఇటలీలో మిస్సింగ్ మిస్టరీ ట్రైన్ నేపధ్యంలో దర్శకుడు రాధ కృష్ణ ఈ సినిమా కథ రాసుకున్నాడని కొన్ని రోజులు క్రితమే వార్తలు వినిపించాయి.

    Recommended Video

    Shyam Singha Roy Teaser : Nani పవర్ఫుల్ పాయింట్... కానీ Pushpa? | Sai Pallavi || Filmibeat Telugu
    ట్రైన్ చూట్టూ

    ట్రైన్ చూట్టూ


    అయితే ఆ మధ్య వినిపిచింది. ఇందులో వాస్తవం ఏమిటో ప్రస్తుతానికి తెలియదు కానీ ఈ సినిమా ప్రమోషన్ స్టఫ్ అంతా కూడా ఈ సినిమాలో ఓ ట్రైన్ ఎపిసోడ్ పక్కాగా ఉన్నట్టే అనిపిస్తుంది. అదీ కాక రాధే శ్యామ్ సినిమాకు యువీ సంస్థ యాబై పడకలతో సెట్ వేయించింది. షూటింగ్ పూర్తి చేశారు కూడా. అయినప్పటికీ అప్పట్లో కరోనా విలయ తాండవం చేస్తుండటంతో బెడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బంది చూసి.. యూవీ సంస్థ ఈ సెట్ లో ఉన్న టోటల్ ఎక్విప్ మెంట్ ను కిమ్స్ హాస్పిటల్ కు డొనేట్ చేసేసింది. ఇది మెక్సికోలో మెంటల్ హాస్పిటల్ సెట్ కోసం వేసిందే అని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఇటలీలో షూట్ చేయడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది.

    English summary
    Story Of Radhe Shyam Inspired By Mysterious Zanetti Train Incident.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X