Don't Miss!
- Lifestyle
World Cancer Day:పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్-రోబోటిక్ సర్జరీ ORసెక్స్ తో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చ
- News
దేశంలోనే తొలిసారి: గర్భం దాల్చిన ట్రాన్స్ జెండర్..మార్చిలో బిడ్డకు స్వాగతం!!
- Finance
Wheat: కేంద్ర ప్రభుత్వం చర్యలతో తగ్గిన గోధుమల ధర..
- Sports
నిఖా చేసుకున్న షహీన్ అఫ్రిదీ.. అమ్మాయి ఎవరో తెలుసా?
- Technology
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు .
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Pushpa 2 లో మరింత పవర్‌ఫుల్‌గా అనసూయ.. ఐటమ్ సాంగ్‌తో వేరే లెవెల్‌లో సుకుమార్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీలోని బన్నీ నటన, స్వాగ్, డైలాగ్స్, డ్యాన్స్ స్టెప్పులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా పుష్పలోని సాంగ్స్ కు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. అందులోనూ స్టార్ హీరోయిన్ స్టెప్పులేసిన ఊ అంటావా మావా పాటకు విజిల్స్ పడ్డాయి.
ఈ సాంగ్ ను రీల్స్, రీక్రియేట్ చేసేలా చేశాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 మూవీ షూటింగ్ ను ఇటీవల ప్రారంభించారు. దీంతో పుష్ప 2 సినిమాలో ఐటమ్ సాంగ్ ను అనసూయతో చేయించనున్నాడట లెక్కల మాస్టారు.

నటీనటుల నుంచి..
పుష్ప.. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చెసింది అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో క్యాస్టింగ్ నుంచి మూవీ టేకింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్ లు, నటీనటుల పెర్ఫామెన్స్ ఒక్కో డైమండ్ అన్నంత టాక్ తెచ్చుకుంది. ఇక సమంత అదిరిపోయే స్టెప్పులేసిన స్పెషల్ సాంగ్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది.

స్పెషల్ గా ఐటమ్ సాంగ్స్..
నిజానికి సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో మొదటగా వచ్చిన ఆర్య సినిమాలో అ అంటే అమలాపురం పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఆర్య 2లో రింగ రింగ, పుష్ప 2లో ఊ అంటావా సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అలాగే జగడం, 100% లవ్, రంగస్థలం చిత్రాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ కు సూపర్ క్రేజ్ వచ్చింది.

నెగెటివ్ క్యారెక్టర్ లో..
ఇక యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ తర్వాత సినిమాల్లోనూ తనదైన నటనతో మెప్పిస్తూ వస్తోంది. క్షణం మూవీతో నటనపరంగా అట్రాక్ట్ చేసిన బ్యూటిఫుల్ అనసూయ.. రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో రంగమత్తగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తర్వాత పుష్ప సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్ దాక్షాయనిగా అలరించింది అనసూయ. ఇలా ఒక్కో సినిమాతో తన గ్రాఫ్ పెంచుకుంటూ పోతోంది అనసూయ.

సుకుమార్ సినిమాల్లో అది పక్కా..
ఇదిలా ఉంటే ఇటీవల అల్లు స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో పుష్ప 2 సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. త్వరలోనే బ్యాంకాంక్ తదితర దేశాల్లో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారని టాక్. ఇంటెన్సివ్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇక సుకుమార్ సినిమా అంటే అందులో ఐటమ్ సాంగ్ కంపల్సరీ. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం తన మెదడుకు పదును పెడుతున్నాడట సుకుమార్.

అనసూయకే ఓటేసిన డైరెక్టర్..
పుష్ప మొదటి పార్ట్ లోని ఐటమ్ సాంగ్ కు మించి డిఫరెంట్ గా ఉండాలని సుకుమార్ ఆలోచిస్తున్నారట. అందుకోసం యాంకర్ అనసూయతో ఐటెం సాంగ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ముందుగా బాలీవుడ్ హాట్ బ్యూటి జాన్వీ కపూర్ ను అనుకున్న చివరకు బ్యూటిఫుల్ యాంకర్ అనసూయకే సుకుమార్ ఓటు వేశాడని ఇన్ సైడ్ టాక్. ఇందులో అనసూయ హాట్ నెస్ పీక్స్ లో, మరింత హాట్ గా ఉండేలా ప్లాన్ చేశాడట క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.

అనసూయ డిమాండ్ దృష్ట్యా
బుల్లితెర యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ బ్యూటి అనసూయకు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా క్రేజ్ అందించేలా సుకుమార్ స్కెచ్ వేశాడని సమాచారం. ఈ ప్రపోజల్ అనసూయ దగ్గరికి కూడా వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. అలాగే పుష్ప 2లో అనసూయ మరింత పవర్ ఫుల్ గా కూడా చూపించనున్నారని మరో టాక్ వినిపిస్తోంది.