దేవరకొండ కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్.. ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదుగా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాల్సి ఉంది.. అయితే కొద్ది రోజులు క్రితం ఈ సినిమా ఉండదేమో అని ప్రచారం కూడా జరిగితే ఈ సినిమా యూనిట్ రంగంలోకి దిగి ఆ ప్రచారం నిజం కాదని ఖండించాల్సి వచ్చింది. ఈ కాంబినేషన్ లో సినిమా ఉందని క్లారిటీ ఇచ్చారు.

అయితే తాజాగా వెల్లడవుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ కొరకు సుకుమార్ ఇప్పటికే లొకేషన్స్ సెర్చ్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ యాసతో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తిగా తెలంగాణలో జరిగేటట్లు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. విజయ్ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడు కావడంతో ఆయనకు నటించేందుకు ఈజ్ కుదురుతుందని భావిస్తున్నారు. పుష్ప సినిమా షూటింగ్ లేకపోవడంతో సుకుమార్ కూడా ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

 Sukumar started work for Vijay Deverakonda’s film

ఈ సినిమా కోసం సుకుమార్ భారీగా రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ కూడా ఆయన తీసుకున్నాడని సమాచారం. ఈ సినిమాను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్‌పి సంస్థ తన డెబ్యూ ప్రాజెక్ట్‌గా నిర్మిస్తోంది. టాలీవుడ్‌లో ఆసక్తి రేపిన ఈ ప్రెస్టీజియస్ సినిమాపై కొన్ని రూమర్స్ రాగా ఆ పుకార్లను చిత్ర నిర్మాణ సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఖండించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాద్ తో 'లైగర్' సినిమా చేస్తున్నారు.. దర్శకుడు సుకుమార్ 'పుష్ప' సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీళ్లిద్దరి కమిట్‌మెంట్స్ అయిన వెంటనే విజయ్ - సుకుమార్ చిత్రం ప్రారంభం కానున్నట్లు నిర్మాణ సంస్థ మొన్నీమధ్య ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X