»   » ఒక అమ్మాయి తప్ప - సందీప్ కిషన్ భయం నిజమేనా..?

ఒక అమ్మాయి తప్ప - సందీప్ కిషన్ భయం నిజమేనా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక్క అమ్మాయి తప్ప సినిమా విషయంలో ఈ సినిమా హీరోయిన్ "నిత్యామీనన్" ఎక్కువగానే హైలైట్ అవుతోంది. ఇందులో సందీప్ కిషన్ హీరో అయినా.. అందరి చూపు నిత్యామీనన్ పైనే ఉంది. ఈమె కథలో కంటెంట్ బలంగా ఉండి.. తన పాత్ర నచ్చితే గానీ ఏ సినిమా ఒప్పుకోదు. అలాంటిది సందీప్ తో నటించడానికి ఒప్పుకుందంటే అమ్మాయిలో ఏదో విషయంలో ఉండే ఉంటుంది అని ఆలో చిస్తాడు సగటు ప్రేక్షకుడు. సరిగ్గా ఇదే పాయింట్ మీద సినిమా ఓపెనింగ్స్ ఆధార పడి ఉన్నాయి.

ప్ర‌స్థానం' వంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన సందీప్‌ కిష‌న్‌ ఇప్పుడు హీరో గా నిలదొక్కుకునే ప్రయత్నం లో ఉన్నాడు ఈ దసలో గనక "ఒక అమ్మాయి తప్ప" తో మంచి హిట్ పడిందీ అంటే సందీప్ కెరీర్ ఊపందుకుంటుంది.అయితే ఇప్పుడు సందీప్ కిషన్ కీ ఒక భయం మొదలయ్యిందట. అదేంటంటే తన పరిస్థితి కూడా "అ.ఆ" తో నితిన్ లా అయిపోతుందా అని. నిజానికి ఆ సినిమా హీరో నితిన్ అయినా పేరు మత్రం సమంతా నే కొట్టేసింది. సమంతా యాక్టింగ్ ని పొగిడే వారే తప్ప నితిన్ ని పట్టించుకున్న వారే కరువయ్యారు..

 Sundeep Kishan

ఇప్పుడు అదే విధంగా నిత్య పక్కన తన పరిస్థితి కూడా అలానే ఔతుందేమో అని భయపడుతున్నాడట సందీప్ కిషన్. ఇప్పుడున్న పరిస్థితిలో ఒకమ్మాయి తప్ప మీదే సందీప్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమాతో తానూ బిజీ హీరోల లిస్ట్ లో చేరి పోవాలనుకుంటున్నాడు.

అందుకే ఈ సినిమా కోసం రెమ్యున రేషన్ కూడా "సినిమా హిట్ అయితేనే అన్న ఒప్పందం మీద చేసేసాడు. కానీ ఇప్పుడు ఈ కష్టమంతా నిత్యా మీనన్ ఖాతా లోకి వెళ్ళిపోతే ఎలా? అన్న ఆలోచనలో ఉన్నాడట ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ హీరో... చూడాలి మరి సందీప్ కిషన్ భయం లో నిజమెంతో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది...

English summary
"Oka ammayi tappa" telugu Movie wich is Sundeep Kishan and Nithya Menen in the lead roles is Releasing Today...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu