For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'మిస్టర్ పెళ్లి కొడుకు'గా మారుతున్న సునీల్

  By Srikanya
  |

  హైదరాబాద్: సునీల్‌, ఇషా చావ్లా కాంబినేషన్ లో 'తను వెడ్స్‌ మను' రీమేక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గతంలో 'రాధాకృష్ణుడు' అనే టైటిల్ పెట్టారు. అయితే ఇప్పుడు మిస్టర్ పెళ్లి కొడుకు గా మార్చాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టైటిల్ క్యాచిగా ఉండి,సబ్డెక్టుని రిప్రెజెంట్ చేస్తుందని ఈ టైటిల్ ప్రిఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి గతంలో బ్లేడ్ బాబ్జీ వంటి కామెడీ చిత్రం అందించిన దేవీ ప్రసాద్‌ దర్శకుడు. ఎన్‌.వి.ప్రసాద్‌, పరాస్‌జైన్‌ నిర్మాతలు.

  ఇటీవలే గోదావరి తీరంలో సన్నివేశాల్ని చిత్రీకరించి..రష్యాలో పాటలు చిత్రించబోతున్నారు. హిందీలో విజయవంతమైన 'తను వెడ్స్‌ మను' చిత్రానికి రీమేక్‌ కావటంతో ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి. 'సునీల్‌ శైలి వినోదం పూర్తిస్థాయిలో ఉన్న చిత్రమిది. మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథలో పలు మార్పులు చేశాం. దేవీప్రసాద్‌ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్న విధానం ఆకట్టుకుంటుంద''ని చిత్ర వర్గాలు తెలిపాయి. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రం సునీల్‌ సినీఖాతాలో ఇంకో హిట్‌ను నమోదు చేసుకుంటుందన్న అభిప్రాయాన్ని దర్శక, నిర్మాతలు వ్యక్తంచేస్తున్నారు. ఈ చిత్రంలో అలీ, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, కాశీ విశ్వనాథ్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సమర్పణ: ఆర్‌.బి.చౌదరి.

  సునీల్‌ మాట్లా డుతూ మొదట అందాలరాముడుతో నాకు ఈ బేనర్‌లో అవకావ మొచ్చింది. పెద్ద బేనర్‌ అని భయ పడ్డాను. నా మీద నమ్మకంతో ఆర్‌బి.చౌదరి ఈ సినిమా చేయించారు. పూల రంగడు కన్నా ముందే ఈ బ్యానర్‌లో సినిమా చేయాలి. పూలరంగడుతో అవకాశం రావటంతో చౌదరి నాకు పర్మిషన్‌ ఇచ్చారు. నాకు నచ్చి డైరెక్టర్‌, ప్రొడక్షన్స్‌లలో అవకాశం రావడం చాలా ఆనందంగా వుంది. 'తను వెడ్స్‌ మను' చిత్రాన్ని నాకు సరిపోయేలా రీమేక్‌ చేస్తున్నారన్నారు.

  ఓ పక్క హాస్య పాత్రలను పోషిస్తూ, మరోపక్క హీరో గా నటిస్తూ కెరీర్‌ను ఓ ప్లానింగ్‌గా మలచుకుంటున్నారు సునీల్‌. బిజీ హాస్యనటుడిగా ఉన్న ఆయన 'అందాల రాముడు' చిత్రంతో కథానాయకుడిగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'మర్యాదరామన్న', 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు', 'పూలరంగడు' తదితర చిత్రాలు చేసిన ఆయనకు 'అప్పల్రాజు' చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. 'పూలరంగడు' విజయంతో ఆయన పాపులార్టీ మరింతగా పెరిగింది. గతంలో హీరో గా చేసేందుకు మధ్యలో కొంత గ్యాప్‌ తీసుకున్నా, ఇప్పుడేమో కథలను బట్టి వరుసగా చిత్రాలు చేసేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తంచేస్తున్నారు.

  English summary
  Mega SuperGood films that produced many blockbusters including recent Rachcha is currently filming Mr.Pelli Koduku with Sunil and Isha Chawla. The film is remake of Bollywood hit Tanu Weds Manu. Devi Prasad is the director, while R B Chowdhary, Paras Jain and N V Prasad are producing it. The film has complete
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X