»   » సునీల్ 'భీమవరం బుల్లోడు' కీ కాపీ గోల?

సునీల్ 'భీమవరం బుల్లోడు' కీ కాపీ గోల?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సునీల్ హీరోగా ఉదయశంకర్ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'భీమవరం బుల్లోడు' . ఈ చిత్రంలో కన్నడంలో ఆ మధ్య వచ్చి హిట్టైన విక్టరీ చిత్రంలో కీలక సన్నివేశాలు,క్లైమాక్స్ ఎత్తేసారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఆ మధ్యన చిత్రం క్లైమాక్స్ రీ షూట్ చేసారని, అది విక్టరీ చిత్రం క్లైమాక్స్ అని చెప్పుకుంటున్నారు. దాంతో విక్టరి చిత్రం రీమేక్ చేద్దామని రైట్స్ తీసుకున్నవాళ్లు ఏం చేయాలో అర్దం కాని సిట్యువేషన్ ఏర్పడిందని చెప్పుకుంటున్నారు.


ఇలా మరో భాషలో హిట్టైన చిత్రాలు కాపీ కొట్టేడప్పుడు..దాని రైట్స్ ఎవరైనా తీసుకున్నారేమో కాస్త చూసుకుంటే బాగుంటుందని అంటున్నారు. కానీ సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్ధ ఇలాంటి కాపీ వ్యవహానికి దూరంగా ఉంటుందని ఓ వర్గం అంటోంది. ఇలాంటి పరువు తక్కువ పనులు ఎప్పుడూ సురేష్ ప్రొడక్షన్ చేయలేదని,చేయబోదని వాదిస్తున్నారు. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే రిలీజ్ దాకా ఆగాల్సిందే. ఇక ఈ చిత్రం ఈ నెల 27 న విడుదల అవుతోంది.

Sunil caught in the 'copy' trap!

మరో ప్రక్క ఈ చిత్రం Short Time (1990) అనే సినిమా ఆధారంగా రూపొందుతోందని తెలుస్తోంది. పిరికివాడైన హీరో ఎలాగూ త్వరలో చనిపోతానని తెలుసుకుని లేని మొండి ధైర్యం తెచ్చుకుని సాహసాలు చేస్తాడు. సంఘ వ్యతిరేక శక్తులను ఎదిరిస్తాడు. అయితే తర్వాత తాను చావబోవటం లేదని, తను తప్పుడు మెడికల్ రిపోర్టులు అందుకున్నానని తెలుసుకుంటాడు. అప్పుడు అతినిలో నిజమైన భయం మొదలవుతుంది. ఈ విషయం తను మొండి ధైర్యంతో ఎదిరించిన విలన్స్ కు సైతం తెలుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందనేది మిగతా కథ. ఇ లాంటి కథే భీమవరం బుల్లోడులోనూ ఉండబోతోందని వినపడుతోంది. కాన్సర్ పేషెంట్ ని అనుకున్న సునీల్...మొండితనంతో సాహసాలు చేయటం...తర్వాత తనకు కాన్సర్ లేదని తెలిసి ఇరిక్కిపోవటం ఫన్నీగా ఉంటుందంటున్నారు. అయితే ఇది కరెక్టా కాదా అన్నది తెలియాలంటే సినిమా రిలీజయ్యేదాకా ఆగాల్సిందే.

సురేష్ బాబు మాట్లాడుతూ...'సినిమా బాగా వచ్చింది. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపుదిద్దుకుంది. ఆడియోలో లేని కొత్త పాటను సినిమాలో జత చేశాం' అన్నారు.
సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈచిత్రాన్ని 'కలిసుందాం..రా!, ప్రేమతో..రా!, రారాజు, బలాదూర్' వంటి సినిమాలను తెరకెక్కించిన ఉదయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 'వేయి అబద్దాలు' ఫేమ్ ఎస్తేర్ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు.

హీరో సునీల్ మాట్లాడుతూ 'కమెడియన్‌గా నా నుంచి ప్రేక్షకులు మిస్సవుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో ఉంటుంది' అన్నారు. దర్శకుడు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ- భీమవరం బుల్లోడు చిత్రం తో మరోసారి ఈ సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉందని, సునీల్ పాత్ర వైవిధంగా ఉంటుందని తెలిపారు. భీమవరం నివాసి అయిన సునీల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఈ పేరు పెట్టడం విశేషమని, పాడింగ్ ఆర్టిస్టులందరూ చిత్రంలో నటిస్తున్నారని అన్నారు.

ఈ చిత్రానికి ఆడియో ఇప్పటికే విడుదల చేసామని,మంచి ఆదరణ పొందుతోందనిని నిర్మాత సురేష్‌బాబు తెలిపారు. తనికెళ్ల భరణి, ఎస్తేర్, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, గౌతమ్‌రాజు, శ్రీనివాసరెడ్డి, తా.రమేష్, సమ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కథ:కవి కాళిదాస్, మాటలు:శ్రీధర్ శీపన, కెమెరా:సంతోష్‌రాయ్, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత:డి.సురేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఉదయ్ శంకర్.

English summary
'Bheemavaram bullodu' was earlier supposed to be released on 14th of this month. However, due to the chaotic political situations in the state, the makers could not find proper date in the second and third week of this month to release the movie. Now, they are planning to release the movie on 27th of February. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu