»   »  మెహర్ గండం : సునీల్‌కి పవన్ ఫ్యాన్స్ థాంక్స్!

మెహర్ గండం : సునీల్‌కి పవన్ ఫ్యాన్స్ థాంక్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : వరుస పరాజయాల కారణంగా దర్శకుడు మెహర్ రమేష్ అంటేనే ఇండస్ట్రీలో ఓ భయం మొదలైంది. ఆయనతో సినిమా చేస్తే ఆరిపోయినట్లే అనే భావన ఏర్పడింది. ఇంలాంటి విషయాలు పుట్టించుకోకుండా ఆయనతో సినిమాలు చేసిన వారు నిండా మునిగిపోయిన నాలిక్కరుచుకున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో మెహర్ రమేష్ సినిమా తీయబోతున్నారనే వార్త యావత్ మెగా ఫ్యాన్స్‌ను ఆ మధ్య ఉలిక్కిపడేలా చేసింది. పవన్ కళ్యాణ్ కాస్త తిక్కోడు...ఆయనకు నచ్చితే ఎవరితోనైనా సినిమా చేయడానికి వెనకాడడు. ఈ నేపథ్యంలో కొంపతీసి ఈ ఇద్దరి కాంబినేషన్ ఓకే అవుతుందేమోనని ఫ్యాన్స్ కంగారుపడ్డారు.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తలు పవన్ కళ్యాణ్ అభిమానులను టెన్షన్ నుంచి విముక్తి చేశాయి. మెహర్ రమేష్ త్వరలో హీరో సునీల్‌తో సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మెహర్ రమేష్ గండం పవన్ కళ్యాణ్‌కి తప్పినట్లే అని సంబర పడిపోతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. మెహర్‌తో సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు సునీల్‌కి థాంక్స్ చెబుతున్నారు.

ఆ విషయాన్ని పక్కన పెడితే...సునీల్‌ను ఇటీవల మెహర్ రమేష్ కలిసారట. మెహర్ రమేష్ చెప్పిన స్టోరీలైన్ సునీల్‌కు బాగా నచ్చిందని, వెంటనే ఓకే చెప్పాడని టాక్. మరి ఈ చిత్రాన్ని నిర్మించేది ఎవరు? ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయాలు అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.

English summary
Film Nagar buzz is that flop director Meher Ramesh next movie with Sunil, who was turned comedian to hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu