twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నో ప్లాబ్లం... సునీల్ సినిమా మొదలవుతోంది

    By Srikanya
    |

    హైదరాబాద్ : పూల రంగడు, మర్యాద రామన్న తో ఊపందుకున్న సునీల్ రీసెంట్ గా సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన భీమవరం బుల్లోడు తో చల్లబడ్డాడు. అయితే అది స్పీడు తగ్గటం కాదని, ఆచి తూచి అడుగు వేయటం అని అంటున్నాడు. ఈ నేపధ్యంలో ఆ మధ్యన అంటే ఆగస్టులో సునీల్ హీరోగా వాసూ వర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రం సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. అయితే ఆ సినిమా తర్వాత ఒక్క అడుగు కూడా పడలేదు. ఈ నేఫధ్యంలో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందంటూ వార్తలు సైతం వచ్చాయి.

    అయితే అలాంటిదేమీ లేదని ఈ చిత్రం నవంబర్ నుంచి కంటిన్యూ షెడ్యూల్ తో షూటింగ్ జరుపుకుని, వేసవి 2015 లో విడుదల చేసేందకు సన్నాహుల చేస్తున్నట్లు సమచారం. ఈ విషయాన్ని కోన వెంట్ ఖరారు చేసారు. చిత్రం గురించి మాట్లాడుతూ... సునీల్ మార్క్ కామెడీ, 'దిల్' రాజు చిత్రాల తరహాలో ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ ఉన్న కథ ఇదని చిత్ర కథారచయిత కోన వెంకట్ అన్నారు.

    'దిల్' రాజు మాట్లాడుతూ - ''గోపిచంద్ మలినేని, కోన వెంకట్ తయారు చేసుకున్న ఈ కథలో ఉన్న వినోదం నచ్చి, చేయాలనుకున్నాను. వాసూ వర్మ చాలా టాలెంటెడ్. వచ్చే నెల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు. ఓ పెద్ద హీరో కోసం రాసుకున్న కథను తనతో తీయడం ఆనందంగా ఉందని సునీల్ అన్నారు. మంచి చిత్రం అవుతుందని వాసూవర్మ చెప్పారు. ఈ చిత్రం ద్వారా దినేష్‌ను సంగీతదర్శకునిగా పరిచయం చేస్తున్నారు.

    Sunil's Dil Raju film from November

    త్వరలో 'భక్తకన్నప్ప' కోసం సెట్స్‌పైకి వెళ్లబోతున్నారు. ఆ తర్వాత గోపీమోహన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. గోపీ మోహన్ త్వరలో దర్శకుడిగా మారబోతున్నాడు. ఢీ, రెడీ, దుబాయ్ శీను, సంతోషం, వెంకీ, కింగ్, నమో వెంకటేశ తదితర హిట్ చిత్రాలకు రచయితగా పని చేసిన గోపీ మోహన్ తాజాగా సునీల్ హీరోగా రూపొందబోయే సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

    ఈ విషయాన్ని గోపీ మోహన్ తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించనున్నారు. హీరోయిన్, ఇతర టెక్నీషియన్స్ ఖరారు కావాల్సి ఉంది. ఇవి పూర్తయిన తర్వాత సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

    వీటితోపాటు మరో కథకి కూడా పచ్చజెండా ఊపారు. రచయిత విక్రమ్‌సిరి చెప్పిన కథ సునీల్‌కి బాగా నచ్చిందట. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని నిర్ణయించుకొన్నారు. విక్రమ్‌సిరి 'రేసుగుర్రం' సినిమాకి రచయితగా పనిచేశారు. సునీల్‌ శైలికి తగ్గట్టుగా పూర్తి వినోదాత్మకంగా సాగే కథని విక్రమ్‌ సిరి తయారు చేశారట. ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించబోతున్నారు.

    మరో ప్రక్క తమిళంలో విజయవంతమైన 'సుందరపాండ్యన్‌' చిత్రాన్ని తెలుగులో సునీల్‌ హీరోగా తెరకెక్కిస్తారని సమాచారం. ఇటీవలే కథ విన్న సునీల్‌ ఇందులో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథాచర్చలు సాగుతున్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోందని సమాచారం.

    ఈ చిత్రానికి 'సుందర్ అండ్ కో ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం రీపొందనుంది. తెలుగులో రీమేక్‌ సినిమాలు తీయడంలో పెట్టింది పేరు... భీమనేని శ్రీనివాసరావు. ఇదివరకు ఆయన తీసిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఏడాది కిందట నరేష్‌తో 'సుడిగాడు' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు. తాజాగా మరో సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు.

    English summary
    Sunil's next in the direction of Vasu Varma will go to floors from November. Kona Venkat has confirmed that he has " written an exciting & entertaining story for Sunil under Dil raju's banner". The film will have non stop schedules from November and will release in Summer 2015.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X