»   » వరుణ్ తేజతో అనుకుంటే సునీల్ సీన్ లోకి

వరుణ్ తేజతో అనుకుంటే సునీల్ సీన్ లోకి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ‘బిందాస్‌', ‘రగడ' చిత్రాల దర్శకుడు వీరూపోట్లతో సునీల్‌ జట్టుకట్టబోతున్నారని సమాచారం. అతి త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నదని తెలుస్తోంది. వినోదం, యాక్షన్‌ కలబోతగా సాగే ఈ చిత్రంలో సునీల్‌ పాత్ర వైవిధ్యంగా సాగబోతోందట. ప్రస్తుతం హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

కొద్ది రోజుల క్రితం వరుణ్ తేజ తో దర్శకుడు వీరుపోట్ల చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు ఇప్పుడు గోపిచంద్ మలినేనికి వెళ్లిందని చెప్తున్నారు. ఆ చిత్రానికి కథ ని వెలిగొండ శ్రీనివాస్ ఇవ్వబోయారని, కథ బాగున్నా..తాను రచయిత కావటంతో ఆ ప్రాజెక్టు వద్దనుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

Sunil’s next to be directed by Veeru Potla

సునీల్ విషయానికి వస్తే... ‘భీమవరం బుల్లోడు' తరవాత సునీల్‌ సినిమా ఏదీ విడుదల కాలేదు. కథల విషయంలో ఆచితూచి వ్యవహరించిన సునీల్‌ ఇప్పుడు జోరు పెంచేశారు. వరుసగా తన సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు. ‘కృష్ణాష్టమి' త్వరలో విడుదల కాబోతోంది. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఓ చిత్రం సెట్స్‌పై ఉంది. ఈలోగా మరో సినిమాపై సంతకం చేశారు.

English summary
Sunil has green signal to writer-turned-director Veeru Potla’s next.
Please Wait while comments are loading...