»   » సన్నీ లియోన్ ఆ హోటల్‌లో..? అనుమానాలు? ఎఫ్ఐఆర్!

సన్నీ లియోన్ ఆ హోటల్‌లో..? అనుమానాలు? ఎఫ్ఐఆర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పోర్న్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సన్నీ లియోన్...ఇక్కడ క్రమ క్రమంగా తన రేంజి పెంచుకుంటోంది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది. అశ్లీల చిత్రాల(పోర్న్) ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో ఇండియాలో అడుగు పెట్టిన మొదట్లో ఆమెను అంతా వ్యతిరేకించారు. ఆ విమర్శలను భరించి తనపై పాజిటివ్ ఇమేజ్ వచ్చేలా చేసుకుంది సన్నీ.

అయితే ఇప్పటికీ ఆమెపై ఉన్న బ్యాడ్ ఓపీనియన్ జనాల్లో తగ్గలేదని తాజాగా ఓ సంఘటన రుజువు చేసింది. తను నటించిన ‘ఏక్ ఫహెల లీలా' సినిమా ప్రమోషన్ కోసం సన్నీ లియోన్ లాస్ట్ సండే సూరత్ పట్టణానికి వచ్చింది. తన భర్త డేనియల్ వెబర్, బాలీవుడ్ నటుడు జై భానుశాలి, డైరెక్టర్ బాబీ ఖాన్ తో కలిసి ఆమె ప్రమోషన్లో పాల్గొనాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో వేదిక ఫైస్టార్ హోటల్ నుండి మరో చోటికి మార్చారు.

 Sunny Leone into hotel for another reason?

దీంతో స్థానిక వ్యక్తి ఒకరు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆమె వచ్చింది సినిమా ప్రమోషన్ కోసం కాదని, ఇతర కారణాలంటూ తన మనసులో ఉన్న అనుమానాలు వ్యక్తం చేసారు. అయితే సూరత్ పోలీసులు మాత్రం ఆమెపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని స్పష్టం చేసారు.

సన్నీ లియోన్ సినిమాల విషయానికొస్తే ‘ప్రస్తుతం ఆమె నటించిన ‘ఏక్ పెహలీ లీలా' చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. దీంతో పాటు మిలప్ జవేరి దర్శకత్వంలో వస్తున్న సెక్స్ కామెడీ చిత్రం ‘మస్తీ జాదే'లో డ్యూయల్ రోల్ చేస్తోంది. దీంతో పాటు దేవాంగ్ ధోలకియా దర్శకత్వంలో ‘కుచ్ కుచ్ లోచా హై' చిత్రంలో కూడా నటిస్తోంది.

English summary
Sunny Leone is on a movie signing spree lately. She is also busy promoting her upcoming film Ek Paheli Leela. Sunny Leone is on a promotional spree for the film but one of her promotional tour went awry with a FIR registered against her.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu