»   » సన్నిలియోన్ పై మంచు మనోజ్ ఆశలు ఆవిరేనా

సన్నిలియోన్ పై మంచు మనోజ్ ఆశలు ఆవిరేనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమ సినిమాతోనే సన్నిలియోన్ ని తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాననే క్రెడిట్ తనకి వస్తుందని, ఆ క్రేజ్ తో బిజినెస్ బాగా జరుగుతుంనే ఆలోచనలో మంచు మనోజ్ ఉన్నారని సమాచారం. అయితే ఇప్పుడు మరో తెలుగు చిత్రం ద్వారా ఆమె ముందే ఇక్కడి వారికి పరిచయమైపోయేటట్లు ఉంది. కుల్పీ పేరుతో వస్తున్న ఓ డబ్బింగ్ చిత్రంలో ఆమె ఐటం సాంగ్ ఉంది. ఆ ఐటం సాంగ్ ఆకట్టుకుంటే మంచు మనోజ్ ..చేయించే సాంగ్ కు మరింత క్రేజ్ వస్తుంది. అయితే సన్నిలియోన్ ని తొలిసారిగా తమ చిత్రం ద్వారానే తెలుగు తెరకు పరిచయం చేయటం అనే క్రెడిట్ మాత్రం పోతుంది.

'వడకర్రీ' అనే తమిళ చిత్రంలో జత కట్టారు జై, స్వాతి. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌ హక్కులను యస్‌.యన్‌.ఆర్‌ సినిమాస్‌ అధినేత నరశింహా రెడ్డి సామల మంచి ఆఫర్‌ ఇచ్చి సొంతం చేసుకున్నారు. కథానుసారం తెలుగు వెర్షన్‌ కు 'కుల్ఫీ' టైటిల్‌ ని ఖరారు చేసారు. వెంకట ప్రభు శిష్యుడు శరవణరాజన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఆడియో వేడుకను జూన్‌ ఫస్ట్‌ వీక్‌ లో జరపాలని నిర్ణయించారు.

Sunny Leone's Item song in Kulfi Movie

చిత్ర నిర్మాత నరశింహా రెడ్డి సామల మాట్లాడుతూ - ''ఇది కామెడీ థ్రిల్లర్‌. ఈ తరహా చిత్రాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తమిళంలో 'వడకర్రీ' టైటిల్‌ తో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'కుల్ఫీ' టైటిల్‌ ని ఖరారు చేసాము. కథానుసారం ఈ టైటిల్‌ ని పెట్టాం. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోర్న్‌ స్టార్‌ సన్నీలియోన్‌ తొలిసారి సౌత్‌ లో నటించిన చిత్రం ఇది. స్పెషల్‌ సాంగ్‌ చేసింది సన్నీలియోన్‌. ఈ సినిమా హక్కులను దక్కించుకుని నిర్మాతగా నేను చేస్తున్న తొలి ప్రయత్నం ఇది. ఈ సినిమాలో ఆరు పాటలున్నాయి. అన్నీ పాటలు చాలా బాగుంటాయి. జూన్‌ ఫస్ట్‌ వీక్‌ లో తెలుగు వెర్షన్‌ ఆడియోను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. లహరి ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలవుతుంది. జై, స్వాతి జంట ఈ చిత్రంలో మరోసారి హిట్‌ కొట్టడం ఖాయం'' అన్నారు.

నిర్మాణ నిర్వాహకులు బాలాజీ మాట్లాడుతూ - ''అందాల నటిగా ఎంతో క్రేజ్‌ ని సంపాదించుకున్న పోర్న్‌ స్టార్‌ సన్నిలియోన్‌ దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తొలి చిత్రంగా మా 'కుల్ఫీ'లో స్పెషల్‌ సాంగ్‌ చేయడం విశేషం. ఈ పాటను బ్యాంకాక్‌, దుబాయ్‌ లో సెట్‌ వేసి చిత్రీకరించడం జరిగింది. సినిమాకి ఈ పాట హైలెట్‌ గా నిలుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది'' అని తెలిపారు.డైలాగ్‌ రైటర్‌ కృష్ణతేజ మాట్లాడుతూ - ''మంచి కథ, ఆసక్తికరమైన స్క్రీన్‌ స్లేతో ఈ చిత్రం రూపొందింది. డైలాగులు, పాటలు బాగుంటాయి'' అన్నారు.

English summary
Ever since glam doll Sunny Leone was roped in for an item song in Jai’s Vadacurry, expectations have run high for the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu