For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పాడు చేయడుగా? : కృష్ణ గారి హిట్ టైటిల్ తో సుధీర్ బాబు కొత్త చిత్రం

  By Srikanya
  |

  హైదరాబాద్ : సూపర్ స్టార్ కృష్ణ గారి చిన్నల్లుడు సుధీర్ బాబు అనే సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఏ.ఎన్ బోస్ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘మోసగాళ్ళకు మోసగాడు' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ‘స్వామి రారా' నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం బ్యాంకాక్ లో ఒక షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది.‘మోసగాళ్ళకు మోసగాడు' టైటిల్ గతంలో కృష్ణ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం. అంతేకాకుండా అదే తెలుగులో మొదటి కౌబాయ్ చిత్రం. ఇప్పుడీ టైటిల్ ని సుధీర్ బాబు తన తాజా చిత్రానికి పెట్టబోతూండటంతో ఆ టైటిల్ కి న్యాయం చేయగలరా...లేక మంచి టైటిల్ ని పాడు చేస్తారా అనే సందేహాలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. ఏదైమైనా అలాంటి సూపర్ హిట్ టైటిల్స్ జోలికి వెళ్లకుండా ఉండటమే మేలని చెప్తున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఎన్.బోస్... స్వామి రారా దర్శకుడు వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవంతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. స్వామి స్వామి రారా అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ది సాగా కంటిన్యూస్ అనేది ఉపశీర్షిక అనే టైటిల్ మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు మారుస్తున్నారు. ఎన్.బోస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని స్వామిరారా చిత్రాన్ని నిర్మించిన చక్రి చిగురుపాటి లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

  Super Star Krishna's title for Sudheer Babu

  నిర్మాత మాట్లాడుతూ..... నవ్యతతో కూడిన కథాంశంతో సినిమాలు రూపొందిస్తే ఆ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ తప్పక వుంటుందని స్వామిరారా చిత్రం మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మించబోతున్నాం. ఓ స్టార్ హీరో నటించనున్న ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా, హై బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత బీఎస్ వర్మ.

  ఇక ఈ సినిమాలో మొదట నిఖిల్ హీరోగా చేస్తారనుకున్నారు. అయితే నిఖిల్...స్క్రిప్టు తో తృప్తి చెందలేదని ట్వీట్ చేసారు అప్పట్లో. ఆ ట్వీట్ లో ఏముందీ అంటే.... ' స్వామి రారా చిత్రం సీక్వెల్ మ్యాటర్ ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది. నేను కూడా ఈ చిత్రం ప్రొడక్షన్ టీంలో ఒక్కడిని. ఈ సినిమా మొదలవ్వచ్చు లేదా మొదలు కాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఒక ఐడియా మీద మాత్రం వర్క్ చేస్తున్నాం. స్వామి రారా కంటే స్క్రిప్ట్ బాగా వస్తేనే స్వామి రారా సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుంది' నిఖిల్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కానీ ఈలోగా ఈ చిత్రం మొదలైంది.

  సుధీర్ బాబు తాజా చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' విశేషాలకు వస్తే...

  Super Star Krishna's title for Sudheer Babu

  సుధీర్‌బాబు, నందిత జంటగా నటించిన చిత్రం 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. ఆర్‌.చంద్రు దర్శకత్వం వహించారు. లగడపాటి శిరీష, శ్రీధర్‌ నిర్మించారు. హరి స్వరాలు సమకూర్చారు. కన్నడలో విజయంతమైన 'చార్‌మినార్‌'కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని గీతాలు విజయవాడలో విడుదలయ్యాయి.

  మహష్‌బాబు ఇప్పటి వరకు 'జల్సా', 'బాద్‌షా' చిత్రాల్లో తన గొంతునే వినిపించారు. తొలిసారి ఓ చిత్రంలో అతిధిగా అలరించనున్నారు. సుధీర్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రంలో మహేష్‌ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ''ఈ చిత్రంలో మహేష్‌బాబు పాత్ర ప్రత్యేకంగా, ఆసక్తిగా ఉంటుంది. ఆయన కథ చెప్పగానే నటించడానికి అంగీకరించారు. ఆయన ఈ చిత్రాన్ని అంగీకరించడంలో సుధీర్‌బాబుది కీలక పాత్ర. మహేష్‌ అభిమానులకు నచ్చేలా ఆయన పాత్ర ఉంటుంది'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

  నిర్మాత ల‌గ‌డ‌పాటి శిరీష శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ.... ఇప్పటి వ‌ర‌కు ఎన్నో ప్రేమ క‌థా చిత్రాలు వ‌చ్చాయి అయితే వాటి అన్నింటికి భిన్నంగా మేము ఓ సినిమాను రూపొందించాల‌ని త‌ల‌పెట్టాము.. దాని ఫ‌లిత‌మే ఈ కృష్ణమ్మ క‌లిపింది ఇద్దరినీ సినిమా .. ఈ సినిమాను పోల్చ వ‌ల‌సి వ‌స్తే గ‌తంలో తెలుగు లో వ‌చ్చిన మ‌రో చ‌రిత్ర హిందీలో వ‌చ్చిన ప్రేమ పావురాలు సినిమా స్థాయిలో ఉంటుంది. ఈ చిత్ర ద‌ర్శకుడు చంద్రు క‌న్నడంలో ఎంతో పేరు ఉన్న ద‌ర్శకుడు.. అత‌డు అక్కడ వ‌ర‌స విజ‌యాల‌ను అందించాడు.

  ఈ చిత్రం సంగీతం గురించి చెప్ప వ‌ల‌సి వ‌స్తే ఆదిత్యా మ్యూజిక్ వారు మామూలు రేటు కంటే ప‌దంత‌లు ఎక్కువ పెట్టి కొన్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన సంగీతాన్ని వారు చేస్తేనే బాగుంటుంది. ఈ చిత్ర సంగీత ద‌ర్శకుడు హ‌రి ఎ.ఆర్‌. రెహ‌మాన్ అంత‌టి స్థాయిలో సంగీతాన్ని అందించాడు అని వారు కొనియాడారు. ఈ సినిమా సంగీతం ప‌రంగా సినిమా ప‌రంగా ప్రేక్షకులను అల‌రిస్తుంద‌నే నమ్మకం మాకు ఉంది. మా బేన‌ర్ స్థాపించి ప‌దేండ్లు కావ‌స్తున్న సంద‌ర్భంగా ఈ సినిమా మంచి విజ‌యాన్ని సంపాదించి పెడుతుంద‌ని ఆశిస్తున్నాము అన్నారు.

  సమర్పకుడు లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ- కన్నడంలో విజయవంతమైన ‘చార్మినార్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నామని, ఈ చిత్రాన్ని చూసిన తొలిచూపులోనే ఇష్టపడి చిత్రాన్ని నిర్మించాలనుకున్నానని, ప్రేమకథాచిత్రమ్‌తో హిట్ పెయిర్‌గా నిలిచిన వీరిద్దరితో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇందులో చక్కని ప్రేమకథ ఉందని, తెలుగు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని ఆయన అన్నారు.

  దర్శకుడు కథ చెప్పిన తీరు నచ్చడంతో తానీ చిత్రాన్ని ఒప్పుకున్నానని, సినిమా ప్రతీ ప్రేక్షకుడికి నచ్చుతుందని, ప్రతిఒక్కరూ ఈ సినిమా చూసి తమ పాత రోజులు గుర్తుచేసుకుంటారని హీరో సుధీర్‌బాబు తెలిపారు.

  కన్నడంలో పెద్ద చిత్రాలమధ్య విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిందని, కథకు తగిన విధంగా పేరును కూడా నిర్ణయించామని దర్శకుడు చంద్రు అన్నారు.

  గిరిబాబు, ఎం.ఎస్.నారాయణ, సారికా రామచంద్రరావు, చిట్టిబాబు, అభిజిత్, కిషోర్‌దాస్, ఆశాలత, ప్రగతి, చైతన్య కృష్ణ తదితరులు నటిస్తున్న చిత్రానికి మాటలు: ఖధీర్‌బాబు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా:కె.ఎస్.చంద్రశేఖర్, సంగీతం: హరి, నిర్మాత: శిరీషా శ్రీధర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఆర్.చంద్రు.

  English summary
  Sudheer Babu is also acting in a film, directed by A.N.Bose, at present. The latest news is that this film has been titled as 'Mosagaallaku Mosagadu'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X