టార్గెట్ కంప్లీట్ చేసే పనిలో మహేశ్ బాబు.. ఆ దేశానికి పయనం? ఎక్కడికంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. బాబు ఎక్కువగా మూవీ సెట్స్ లో, ఇంట్లో లేదంటే ఎయిర్ పోర్టులోనే దర్శనిమిస్తూ ఉంటారు. సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో పాటు ఏదోక దేశానికి వెకేషన్ కు వెళ్లిపోతారు. ఉంటే సినిమా షూటింగ్ లో లేదంటే.. ఫ్యామిలీతో వెకేషన్ లో మాత్రమే కనిపిస్తారు. ఇక తన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తాడో ఫ్యాన్స్ ను కూడా అంతలా అభిమానిస్తారు. అయితే మహేశ్ బాబు తాజాగా ఎయిర్ పోర్టులో కనిపించడంతో బాబు పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీని వెనకాల ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉండటం విశేషం.

ఇన్నాళ్లు మహేశ్ బాబు కేవలం రీజినల్ ఫిల్మ్స్ లోనే నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్ బాబు కంటే చిన్న హీరోలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలను రిలీజ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహేశ్ బాబు పాన్ ఇండియా సినిమా ఎప్పుడు చేస్తారని ఆశించగా, ఏకంగా ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంలోనే నటిస్తుండటం విశేషం. ఇప్పటికే SSMB 29 వర్క్ టైటిల్ తో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇండియాలో, విదేశాల్లో పలు కీలక సన్నివేశాలను కూడా షూట్ చేశారు.

Superstar Mahesh babu Travel To Tanzania

SSMB 29 మూవీ షూటింగ్ ఇప్పటి వరకు 3 షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ఇందులో హైదరాబాద్, కర్ణాటక, ఓడిశా, కొరపుట్, జైపూర్, డియోమలి వంటి ప్రాంతాల్లో షూటింగ్ ను జరిపారు. ఇక నెక్ట్స్ షెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేశారు. షూటింగ్ కు అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. కానీ కెన్యాలోని రాజకీయ పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్ ను వాయిదా వేశారు. ఇక ఇప్పుడు మహేశ్ బాబు మళ్లీ షూటింగ్ కు సిద్ధమయ్యారని తెలుస్తోంది. నెక్ట్స్ షెడ్యూల్ లో పాల్గొనేందుకే మహేశ్ బాబు హైదరాబాద్ నుంచి టాంజానియాకు బయల్దేరానని అంటున్నారు.

ఈ సందర్భంగా తాజాగా మహేశ్ బాబు ఎయిర్ పోర్టు లుక్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. SSMB 29 నెక్ట్స్ షెడ్యూల్ ను ఎస్ఎస్ రాజమౌళి టాంజానియా ప్లాన్ చేశారని తెలుస్తోంది. దాంతర్వాత యూరోప్ లో మరో షెడ్యూల్ ఉంటుందని అంటున్నారు. ఇక మహేశ్ బాబు ఈ షెడ్యూల్స్ లో కీలక సన్నివేశాల్లో నటించబోతున్నారని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాకు సంబంధించిన ఫస్ట్ అప్డేట్ ను నవంబర్ 2025లో ఇస్తానని అధికారికంగా ప్రకటించారు.

ఫస్ట్ అప్డేట్ వచ్చేలోపు టాంజానియా, సౌత్ ఆఫ్రికా, యూరోప్, ఇతర దేశాల్లోని మేజర్ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మహేశ్ బాబు తన షూటింగ్ పార్ట్ ను త్వరత్వరగా కంపీట్ చేసుకునేందుకు రెగ్యులర్ గా షూటింగ్స్ కు హాజరవుతున్నారు. ఇక ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నండటం విశేషం.

More from Filmibeat

Read more about: mahesh babu ssmb 29 ss rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X