»   » సురేంద్రరెడ్డి తదుపరి చిత్రం హీరో ఫైనల్, ఎవరంటే

సురేంద్రరెడ్డి తదుపరి చిత్రం హీరో ఫైనల్, ఎవరంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్యన కిక్ 2 చిత్రంతో వెనకపడ్డ దర్శకుడు సురేంద్రరెడ్డి...రీసెంట్ గా ధృవ చిత్రంతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. తెలుగు సిని పరిశ్రమలో స్టైలిష్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న సురేందర్‌రెడ్డి ఎవరితో సినిమా చేసినా సరే, ఆ హీరో ని స్టైలిష్‌గా చూపిస్తాడు. దాంతో హీరోలంతా ఆయన దర్శకత్వంలో చేయటానికి ఉత్సాహం చూపిస్తూంటారు.

రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ధృవ' సినిమాతోనూ అదే విషయం మరోసారి రుజువైంది. రామ్‌చరణ్‌ ఇన్నాళ్లూ తెరపై కనిపించింది ఒకెత్తైతే, 'ధృవ' సినిమాలో కనిపించింది మరో ఎత్తు అన్నట్టుగా ఆ సినిమా అభిమానుల్ని అలరిస్తోంది. ఈ నేపధ్యంలో విజయోత్సాహంలో ఉన్న సురేందర్‌ రెడ్డి తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నారనేది ఆసక్తికరమే.

Surender Reddy's next with Akhil

అందుతున్న సమాచారం ప్రకారం...సురేంద్రరెడ్డి తన తదుపరి చిత్రాన్ని అఖిల్‌ అక్కినేనితో సినిమా చేయబోతున్నాడు. అఖిల్‌ ప్రస్తుతం తన రెండో చిత్రంపై దృష్టిపెట్టారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రం వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఆ తర్వాత సినిమా సురేందర్‌రెడ్డితోనే అని, సూరి స్టైలిష్‌ హీరోల జాబితాలో అఖిల్‌ కూడా చేరబోతున్నాడని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు గట్టిగానే చెప్పుకొంటున్నాయి.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే..ఆ చిత్రాన్ని రామ్‌చరణ్‌ నిర్మించబోతున్నారనే ప్రచారం మరో ఎత్తు. రామ్‌చరణ్‌, అఖిల్‌ మంచి స్నేహితులు. వాళ్లిద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. మరికొన్ని రోజులు తర్వాత ఆ చిత్రంపై స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశాలున్నాయి.

ఇక అఖిల్ విషయానికి వస్తే... ఇటీవలే తాను కోరుకున్న అమ్మాయితో నిశ్చితార్థ వేడుకను పూర్తి చేసిన అఖిల్ , ఇక రెండో సినిమాకు కూడా ముహూర్తం ఫిక్స్ చేసాడు.అక్కినేని కుటుంబ చిత్రం ...మనం రూపొందించి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్ తో అఖిల్ రెండో సినిమా చేస్తున్నారు.

ఇప్పటి వరకు స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన విక్రమ్, జనవరి 4వ తేదీన ఈ సినిమా షూటింగును మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడట. జనవరి 4 నుండి వారం రోజులపాటు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో మొదటి షెడ్యూలు జరుపుకోబోతుందని సమాచారం.

ఇక ఈ మూవీ లో అఖిల్ సరసన తమిళ్ భామ మేఘా ఆకాశ్ నటించబోతుంది. వినాయిక్ దర్శకత్వంలో చేసిన తొలి చిత్రం తో అభిమానులను డిస్పాయింట్ చేసిన అఖిల్ , రెండో సినిమాలో అలాంటి తప్పు జరగకూడదని చాల జాగ్రత్తలు తీసుకున్నాడని తెలుస్తుంది. నాగార్జున కూడా తనయుడుకి హిట్ దక్కేలా సినిమాలో అవసరమైన మేరకు జోక్యం చేసుకోనున్నాడట.

English summary
Surender Reddy 's immediate next movie is with Akhil. Now Akhil is bracing up to shoot for Vikram Kumar's movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu