For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూర్య 'బ్రదర్శ్' లో పవన్,మహేష్ బాబు

  By Srikanya
  |

  హైదరాబాద్ : సూర్య,కాజల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం మాట్రాన్. అవిభక్త కవలల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రదర్శ్ అనే టైటిల్ పెట్టి తెలుగుకు అనువదిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 12న విడుదల అవుతున్న ఈ చిత్రంలో బ్రదర్శ్ ఇద్దరూ...తెలుగులో స్టార్ హీరోలైన మహేష్,పవన్ కళ్యాణ్ లకు ఫ్యాన్స్ అని సమాచారం. దాంతో జంట కవలలుగా ఉన్న వారిద్దరూ సినిమాకు వెళ్లాలనుకున్నప్పుడు సమస్య వస్తుంది. ఎవరి హీరోకు వాళ్లు వెళ్లాలని పట్టుబట్టే సీన్స్ ఫన్నీగా ఉంటాయి. అవి సినిమాలో ఆ హీరోల అభిమానులును అలరిస్తాయని చెప్తున్నారు. తమిళానికి అజిత్,విజయ్ అభిమాలుగా ఈ జంట కవలలు కనిపిస్తారు. తెలుగు నేటివిటీకి తగినట్లుగా ఇలా పవన్,మహేష్ ల ప్రసక్తి తీసుకువచ్చి క్యాష్ చేసుకోవాలని దర్శకుడు ఆలోచన అని ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది.

  గతంలో సూర్య నటించిన సెవెంత్ సెన్స్ చిత్రం మిక్సెడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా,ఓపినింగ్స్ పరంగా మంచి రెవిన్యూ తెచ్చి పెట్టింది. దాంతో ఈ చిత్రానికి సైతం మంచి డిమాండ్ ఏర్పడింది. బెల్లంకొండ సురేష్ తెలుగుకి ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఇక తొలిసారిగా సూర్య తన వాయిస్ ని తెలుగువారికి వినపించనున్నారు. తనే తన పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. బెల్లంకొండ సురేష్ తెలుగుకి అందిస్తున్న ఈ చిత్రం సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. సూర్యకు తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇక్కడా మంచి ఓపినింగ్స్ ఉంటాయంటున్నారు.

  కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రైట్స్ కి మార్కెట్లో మంచి రేటు పలికింది . కెవి ఆనంద్ గతంలో జీవా హీరోగా రూపొందిన చిత్రం తెలుగులో 'రంగం'టైటిల్ తో విడుదల చేస్తే మంచి విజయం సాధించింది. అదే స్పూర్తితో సూర్యకి,కెవి ఆనంద్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయాలని బెల్లంకొండ నిర్ణయించుకున్నారు. హ్యారీస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

  సూర్య మాట్లాడుతూ... బ్రదర్శ్ లో ప్రతి సన్నివేశంలో నటించ డం సరికొత్త అనుభవమే. నేను నటుడిగా రంగప్రవేశం చేసి 13 ఏళ్లు అయ్యింది. ఇప్పటివరకు బ్రదర్శ్ చిత్రం లో పాత్రల తరహాలో నటించలేదు. ఇందులో కవలలుగా విరుద్ధ భావాలున్న పాత్రలు పోషించాను. ఒక పాత్ర పేరు అఖిళన్, మరో పాత్ర పేరు విమలన్. ఒకరు కమ్యూనిస్టు భావాలు కలవాడయితే, మరొకరు పూర్తి జాలీ టైప్. అయితే ఇద్దరూ హీరోలే. రెండు పాత్రల్లోనూ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఇక ఇందులో దర్శకుడి పని తీరు అద్భుతం. బ్రదర్స్ చిత్రం కోసం కెవి ఆనంద్ ఎంతగా శ్రమించారో నాకు తెలుసు.

  దర్శకుడు కె.వి.ఆనంద్ మాట్లాడుతూ థాయిలాండ్‌కు చెందిన అవిభక్త కవలలను స్పూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం మాట్రాన్ అని తెలిపారు. ఈ కవలలు అమెరికా వెళ్లి ఒక సర్కస్ కంపెనీ ప్రారంభించి బాగా ఉన్నత స్థితికి చేరుకున్నారని శివాజీ చిత్ర షూటింగ్ సమయంలో ఫ్లైట్‌లో పయనిస్తుండగా ఒక మ్యాగజైన్‌లో చదివానన్నారు. అప్పుడే దీన్ని ఇతివృత్తంగా తీసుకుని చిత్రం చేద్దామని సూర్యతో చెప్పానన్నారు.

  English summary
  Suriya seems to be extremely confident about the success of K V Anand’s upcoming film Brothers. He’ll be seen as conjoined twins in the film and the buzz is that the ‘conjoined twins’ parts lasts only for 40 minutes. The rest of the film is said to be a stunning action adventure laced with good romance and family drama. Kajal is playing the lead role in the film. Bellamkonda Suresh is releasing the film all over Andhra Pradesh. Harris Jayaraj has composed the music. The film’s teasers and posters have already created a good buzz. Brothers is going to hit the screens on October 12.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X