For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూర్య 'సికిందర్‌' కథ ఇదేనా?

  By Srikanya
  |

  హైదరాబాద్ : సూర్య హీరోగా నటించిన చిత్రం 'సికిందర్‌'. తమిళంలో 'అంజాన్‌'గా విడుదలవుతోంది. సమంత హీరోయిన్. లింగుస్వామి దర్శకత్వం వహించారు. ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రం కథ అంటూ తమిళ వర్గాల్లో ఓ స్టోరీ పాపులర్ అవుతోంది. అదేమిటంటే...

  చిత్రంలో సూర్య, విద్యుత్ జమాల్ ఇద్దరూ క్లోజ్ ప్రెండ్స్. విద్యుల్ జమాల్ ని కొందరు ఓ గొడవలో చంపేస్తారు. అప్పుడు తన స్నేహితుడు మరణానికి రివేంజ్ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఫేక్ గా తన మరణాన్ని క్రియేట్ చేసుకుంటాడు. గ్యాంగస్టర్ సూర్యగా రంగంలోకి దిగుతాడు. తర్వాత అతనికి తన స్నేహితుడు మరణం వెనక ఉన్న కొన్నిషాకింగ్ నిజాలు తెలుస్తాయి. అప్పుడేం చేసాడు..ఆ నిజాలేంటి అనేదే కథ అంటున్నారు. అయితే ఈ కథ టీజర్ చూసి వండిందా లేక నిజంగా ఇదే కథేనా అనేది తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

  నిర్మాత లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ ''సూర్య సినిమా అంటే యాక్షన్‌ హంగామానే. ఆయన శైలికి తగిన కథ ఇది. లింగుస్వామి కథను తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకొంటుంది. సమంత ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తుంది. ఆమె గ్లామర్‌, నటన ప్రధాన ఆకర్షణ. బ్రహ్మానందం మరోసారి నవ్వులు పూయిస్తారు. చిత్రాంగదాసింగ్‌ ప్రత్యేక గీతంలో తళుక్కుమంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. సూర్య కెరీర్‌లో మరో మంచి చిత్రంగా మిగిలిపోతుందన్న నమ్మకం ఉంది''అన్నారు.

  Surya's Sikander Story Leakage

  సూర్య ఇందులో కృష్ణ, రాజుభాయ్‌ అని రెండు పాత్రలు చేశారు. ముంబై నేపథ్యంలో కథ జరుగుతుంది. సంతోష్‌శివన్‌ కెమెరా పనితనం, యువన్‌ సంగీతం హైలైట్‌ అవుతాయి. సమంత, విద్యుత్‌ జమ్వాల్‌, బ్రహ్మానందంగారు ఇలా మంచి టీమ్‌ కుదిరింది. సినిమాలో ప్రతి 15-20 నిమిషాలకు ఒక ట్విస్ట్‌ ఉంటుంది.

  సూర్య మాట్లాడుతూ ''లింగుస్వామితో మా తమ్ముడు కార్తి 'ఆవారా' చేశాడు. ఈ డైరక్టర్‌తో షూటింగ్‌ చేస్తే మంచి ట్రిప్‌కి వెళ్లొచ్చిన ఫీలింగ్‌ ఉంటుందని చెప్పాడు. నాక్కూడా అచ్చం అలాగే అనిపించింది. మామూలుగా హీరోల దర్శకులు, నిర్మాతల దర్శకులు ఉంటారు. కానీ, లింగుస్వామి ఆడియన్స్‌ డైరక్టర్‌. తన మెమరీ పవర్‌ అమేజింగ్‌. ప్రతి సినిమాలోనూ, ప్రతి సన్నివేశంలోనూ ఏదో మేజి క్‌ చేస్తాడు. రెగ్యులర్‌ సినిమాను కూడా ఆయన చెప్పే స్టైల్‌, చూపించే విధానం కొత్తగా ఉంటుంది. అసలు ఎవరూ ఊహించని ఆ ట్విస్ట్‌లు విని నేను బాగా ఎంజాయ్‌ చేశాను. ఈ సినిమా విడుదలయ్యాక లగడపాటి శ్రీధర్‌ ద మోస్ట్‌ హ్యాపీయస్ట్‌ ప్రొడ్యూసర్‌గా ఉంటారు'' అని అన్నారు.

  విద్యుత్‌ జమ్వాల్‌, మనోజ్‌బాజ్‌పాయ్‌, వివేక్‌, బ్రహ్మానందం, సూరి తదితరులు నటిస్తున్నారు. యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌, తిరుపతి బ్రదర్స్‌ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు.

  English summary
  Various stories are doing rounds in media that the real story of Surya's latest action entertainer Sikander is out.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X