»   » రూ. 400 కోట్ల భరణం అడుగుతున్న హృతిక్ భార్య?

రూ. 400 కోట్ల భరణం అడుగుతున్న హృతిక్ భార్య?

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Sussanne Khan Claims Rs 400 Crores From Hrithik Roshan
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఆయన భార్య సుజానె విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రేమించి వివాహం చేసుకున్న వీరు 13 ఏళ్ల పాటు అన్యోన్య దాంపత్యం సాగించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అనంతరం వచ్చిన అభిప్రాయ బేధాలతో 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు.

కాగా....భర్త నుండి సుజానె రోషన్ రూ. 400 కోట్లు భరణం కింద డిమాండ్ చేస్తున్నట్లు బాలీవుడ్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది. భర్త ఆస్తిలో భార్యకు వాటా లభిస్తుంది కాబట్టి ఈ మేరకుజాతీయ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి.

గతంలో ఇలాంటి వార్తలు రాగా...సుజానె రోషన్ ఖండించారు. డైవర్స్ సెటిల్మెంట్ అనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇది పూర్తిగా ఆధారం లేని వార్తలే అని ఆమె తేల్చి చెప్పారు. ఈ వార్తలు తనను ఎంతో బాధించాయని ఆమె చెప్పుకొచ్చారు. అయితే మరోసారి ఇలాంటి వార్తలే ప్రచారంలోకి రావడం చర్చనీయాంశం అయింది.

చిన్నతనం నుండే సుజానెను ప్రేమిస్తున్న హృతిక్ డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో తన ప్రేయసి సుజానెను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు. హ్రెహాన్, హృదాన్. 'సుజానె నా నుండి విడిపోవాలని కోరుకుంటోంది, నాతో ఉన్న బంధాన్ని తెంచుకోవాలని కోరుకుంటోంది. మా ఫ్యామిలీ మొత్తానికి ఇది చాలా కఠినమైన సమయం. మా ప్రైవసీకి కేటాయించాలని మీడియా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను' అంటూ 39 ఏళ్ల హృతిక్ రోషన్ ఆ మధ్య మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

English summary
Following their separation, actor Hrithik Roshan and Sussanne Khan recently filed a divorce case. And now, it has been reported that Sussanne has demanded a huge sum of Rs 400 crores from Hrithik Roshan as alimony.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu