రానాకు హ్యాండిచ్చిన టబు.. కుదరని చెప్పేసిందా..?
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దగ్గుబాటి రానా తన కొత్త సినిమా 'విరాట పర్వం'. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో రానాకు జోడీగా ఫిదా భామ సాయి పల్లవి నటించనుంది. సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్త సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
కాగా సీనియర్ నటి టబు 'విరాట పర్వం' సినిమాలో కీలక పాత్ర పోషించనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో మానవ హక్కుల పోరాట నాయకురాలిగా టబు పాత్ర ఉంటుందని అన్నారు. కానీ తాజాగా బయటకొచ్చిన సమాచారం మేరకు టబు ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె.. డేట్స్ కుదరకపోవడం కారణంగా రానా 'విరాట పర్వం' లో నటించనని చెప్పేసిందట. అయితే ఆమె స్థానంలో బాలీవుడ్ నటి నందితా దాస్‌ని కన్ఫర్మ్ చేసినట్లు టాక్.

చిత్రంలో రానా నక్సలైట్ పాత్ర పోషించనుండగా, సాయి పల్లవి జర్నలిస్ట్‌గా నటించనుందని తెలుస్తోంది. వృత్తిలో భాగంగా రానాను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన సాయిపల్లవి.. అతనితో ప్రేమలో పడుతుందని, ఆ తర్వాత కొన్ని మలుపులు తిరిగి రానా జన జీవన స్రవంతిలోకి రావడం జరుగుతుందని అంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాల క్రిందటి పోటిటికల్ బ్యాక్ గ్రౌండ్‌లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. రానా, సాయి పల్లవి మొదటిసారి జోడీ కడుతున్న ఈ చిత్రం ఇద్దరి కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని చిత్రయూనిట్ చెబుతోంది.


Click it and Unblock the Notifications











