For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా రెమ్యునేషన్ తగ్గించినా సరే, తమన్నాని తీసుకోవాల్సిందే

  By Srikanya
  |

  హైదరాబాద్ : సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. దానికి తోడు సక్సెస్ లేనప్పుడు మరీ భయాలు ఎక్కవ అవుతూంటాయి. ప్రతీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలనిపిస్తుంది. అంతకు ముందు తమ సినిమాల్లో హిట్టైన ఎలిమెంట్స్ ని తీసుకు వచ్చి కలపాలి అనిపిస్తూంటుంది.

  ఇవి బయిటనుంచి చూసి వారికి అతి క్రింద కనిపించినా, కోట్లతో ముడిపడ్డ వ్యాపారంలో ఇవి కామన్. అలాగే ఇప్పుడు దర్శకుడు సంపత్ నందికి తమన్నా అంటే సెంటిమెంట్ అని మీడియాలో వినిపిస్తోంది. దానికి కారణం.. గతంలో సంపత్‌ నంది దర్శకత్వం వహించిన రచ్చ.. బెంగాల్‌ టైగర్‌ సినిమాల్లో తమన్నా నటించింది. ఈ సినిమాలు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి.

  దాంతో తన సినిమాలో తమన్నా చేస్తే హిట్‌ ఖాయమనే ఒక సెంటిమెంట్‌ ను సంపత్‌ నంది నమ్ముతున్నాడు. స్పెషల్‌ సాంగ్‌ లో మెరవడానికి ఆయన తమన్నాను ఒప్పించాడని అంటున్నారు. అయితే అంత పెద్ద మొత్తం పెట్టి తమన్నాను తమ సినిమాలో తీసుకోవటానికి నిర్మాత ఆసక్తి చూపకపోయినా..అవసరమైతే తన రెమ్యునేషన్ అయినా తగ్గించుకుని ఆమెను సీన్ లోకి తెమ్మని కోరాడంటున్నారు సినీ వర్గాలు.

  అదే నిజమైతే తన సెంటిమెంట్ తమన్నా కోసం తన రెమ్యునేషన్ ఎమౌంట్ ని త్యాగం చేసినట్లే. అయితే ఈ విషయం విన్న తమన్నా కూడా తనకు సంపత్ నంది అంటే అభిమానం ఉందని, తను స్పెషల్ సాంగ్స్ కు తీసుకునే రెమ్యునేషన్ తగ్గించి తీసుకుంటానని ప్రామిస్ చేసిందని చెప్పుకుంటున్నారు. ఇందులో నిజమెంత ఉందో కానీ చెప్పుకోవటానికి మాత్రం చాలా బాగుంది కదా.

  గోపీచంద్ కోసం

  గోపీచంద్ కోసం

  గోపీచంద్‌ హీరోగా దర్శకుడు సంపత్‌ నంది ఒక సినిమాను ప్లాన్‌ చేశాడు. ఈ సినిమా కోసమే తమన్నా ఐటం సాంగ్ చేస్తుంది

  త్వరలోనే

  త్వరలోనే

  త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కేథరిన్‌, హన్సిక లను ఎంపిక చేశారు.

  అయితే...

  అయితే...

  తమన్నా ప్రత్యేకపాత్రలో ఈ సినిమాలో కనిపించదనీ.. కేవలంస్పెషల్ సాంగ్ మాత్రమే అనీ, అదీ సంపత్‌ నందికి గల సెంటిమెంట్‌ అందుకు కారణమని తెలుస్తోంది.

  ఇప్పటికే...

  ఇప్పటికే...

  తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న అభినేత్రి చిత్రంలో నటిస్తోన్న తమన్నా 'బాహుబలి-2'లో కూడా నటిస్తోంది.

  ఇష్టం ఉండదు

  ఇష్టం ఉండదు

  ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అందంతో సినిమాలు చేస్తున్న ఈమెకు ఏడుపుగొట్టు సినిమాలంటే ఇష్టం ఉండదట.

  బాధలే ఉంటే ఎలా

  బాధలే ఉంటే ఎలా

  " సినిమా అంటే కొద్దిసేపు ప్రేక్షకున్ని ఎంటర్టైన్ చేసేది. అక్కడకూడా భాదలే ఉంటే ఎలా..? నేనైతే అలంటి సీన్లుండే సినిమాల్ని చూడలేను.

  అంతేకాదు

  అంతేకాదు

  నా అభిమానులకీ అలా కనిపించి వారినీ భాద పెట్టలేను" అంటూ స్టేట్మెంటిచ్చేసింది. అయితే ఇదివర లో తమ్మూ కి ఎక్కువ పేరు తెచ్చిన "ఊసర వెల్లి", ఆవారా లాంటి సినిమాలని మర్చి పోయినట్టుంది

  ఎంజాయ్ చెయ్యాలి

  ఎంజాయ్ చెయ్యాలి

  సినిమా అంటేనే రెండు గంటల సేపు ఎంజాయ్ చేసేలా ఉండాలి కానీ ఏడుపు తెప్పించే సినిమాల్లో అవకాశం వచ్చినా చేయననే చెబుతోంది.

  ఇది విన్న డైరక్టర్లు...

  ఇది విన్న డైరక్టర్లు...

  అయినా సినిమా అన్నాక సెంటిమెంటూ పండాలి కదా...! అది చేయనూ...ఇది చేయనూ అంటే ఉన్న అవకాశాలూ రావేమో...! అంటున్నారు ఇది విన్న సినిమావాళ్లు.

  నేర్చుకుని

  నేర్చుకుని

  బాహుబలి 2 లో క్లైమాక్స్ సీన్స్ లో పాల్గొనేందుకు తమన్నా గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది. ముంబైలో తన ఇంటి వద్ద ఉన్న ఆమె అక్కడ హార్స్ క్లబ్ కు వెళ్లి గుర్రం స్వారిలో ట్రైనింగ్ తీసుకుంటోంది.

  అభినేత్రి గురించి..

  అభినేత్రి గురించి..

  "విజయ్‌ కథ చెప్పిన పది నిమిషాల్లో అంగీకరించాను. 'బాహుబలి' తర్వాత ప్రేక్షకులు నానుంచి కొత్తగా ఆశిస్తారు. దర్శకుడు అంచనాలకు అతీతంగా చూపించారు. మంచి నటిగా తీర్చిదిద్దారు.

  పరిగణించలేం

  పరిగణించలేం

  ఇప్పటివరకూ నేర్చుకున్నదంతా మర్చిపోయాను. ప్రచార చిత్రంలో నన్ను గుర్తుపట్టకపోవడం సంతోషంగా ఉంది. ఇది హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం కాదు. ప్రభుదేవా లేకుండా 'అభినేత్రి' లేదు. హారర్‌ చిత్రమూ కాదు. ఏదోక జోనర్‌ కింద పరిగణించలేం. చిత్రం చూస్తే మీకు తెలుస్తుంది "అన్నారు.

  English summary
  Tamanna became sentiment for the director Sampath Nandi.Presently Sampath Nandi is making movie the hero GOPI CHAND. But his sentiment made Tammanna to appear in his movie as in an ITEM SONG or in a Cameo role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X