»   » తెలుగులో తమన్నా ఐటం సాంగ్

తెలుగులో తమన్నా ఐటం సాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Tamannaah item number in Bellamkonda’s film
హైదరాబాద్: ఇన్నాళ్లూ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తమన్నా ఇప్పుడు ఐటం సాంగ్స్ కి సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తాజాగా ఆమె వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఐటం సాంగ్ చేయటానికి సైన్ చేసిందని వినికిడి. చాలా హాట్ గా ఈ ఐటం సాంగ్ ని డిజైన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో ఆమె ఐటం కనిపించనుంది. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్నాడు.

ప్రస్తుతం మహేష్‌బాబు సరసన 'ఆగడు'లో నటిస్తోంది తమన్నా. తమన్నా మాట్లాడుతూ...'' హీరోయిన్ పాత్ర కథలో భాగంగా ఉండాలి అనుకోవడంలో తప్పులేదు. అలాంటి పాత్రలే పండుతాయి కూడా. వాటికి ప్రేక్షకుల ప్రశంసలు దక్కితే అదే పది వేలు. అవార్డుల్ని బోనస్‌గానే భావించాలి. వాటి కోసమే సినిమాలు చేయకూడదు. కొన్ని సినిమాలు అవార్డుల కోసం భారమైన కథా, కథనాలతో వండేస్తారు. అలాంటి సినిమాల్లో కళాత్మక విలువలు ఉంటే ఫర్వాలేదు. కేవలం ప్రేక్షకుల్ని ఏడిపిస్తే అవార్డులొస్తాయనుకొంటారు. అలాంటి సినిమాల్లో నేను నటించలేను. కాస్త గ్లామర్‌, కాస్త నటన కలబోసిన పాత్రలు చాలు. అంతిమంగా సినిమా బాగుండాలి. దాని వల్ల నిర్మాతలకు నాలుగు డబ్బులు రావాలి అంతే'' అని చెప్పుకొచ్చింది తమన్నా.

అలాగే పురస్కారాలు అందించే ఆనందం వేరు. పారితోషికం జేబు నింపితే.. అవార్డు మనసు నింపుతుంది. అందుకే ఒక్కసారైనా అలాంటి అరుదైన గుర్తింపు సొంతం చేసుకోవాలని తారాలోకం తహతహలాడుతుంటుంది. కానీ.. తమన్నా మాత్రం 'అవార్డుల కోసం నేనెప్పుడూ ఆశపడలేదు. వాటి కోసమే సినిమాలు చేయాలనుకోవడం తప్పు' అంటోంది.

'ఆగడు' చిత్రం తో బిజీగా ఉన్న తమన్నా మరో చిత్రం సైన్ చేసింది. సురేంద్రరెడ్డి దర్సకత్వంలో రూపొందనున్న కిక్ చిత్రం సీక్వెల్ ని ఆమె ఓకే చేసిందని తెలుస్తోంది. కిక్ 2 లో రవితేజ సరసన ఆమె అల్లరి చేసే పాత్రలో కనిపించనుంది. వీరిద్దరి రొమాన్స్ తొలిసారి కావటంతో మంచి ఎక్సపెక్టేషన్స్ ఉండే అవకాసం ఉంది.

కిక్ చిత్రం రవితేజ కెరీర్ కు కిక్ ఇచ్చింది. అప్పటివరకూ ఓ రకంగా నడుస్తున్న రవితేజ కెరీర్ కిక్ తో మరింత విజృంభించింది. రవితేజ, ఇలియానా కాంబినేషన్లో సురేంద్రరెడ్డి రూపొందించిన ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ సీక్వెల్ లోనూ రవితేజ హీరోగా చేస్తున్నారు. మరో హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతుంది. 2014 జూన్ నెలలో ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఆ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులనే ఈ చిత్రానికి తీసుకోనున్నారు.


English summary
Sources say that Tamannaah will be featuring in an introduction song in the film and share screen space with Bellamkonda Srinivas.Tamannaah to sizzle in an item number.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu