Just In
- 2 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 3 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 3 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 5 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
ఢిల్లీ ఘర్షణ: 86 మంది పోలీసులకు గాయాలు, చిక్కుకున్న 300 మంది కళాకారులు..
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తమిళ్ రాకర్స్‌కు చిక్కిన సూపర్ స్టార్.. ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన దర్బార్
ఈ కాలంలో సినిమాను తీయడం ఎంత కష్టంగా మారిందో.. పైరసీ బారిన పడకుండా కాపాడుకోవడం అంత కంటే కష్టంగా మారింది. మొదటి ఆట ముగిసిన వెంటనే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతోంది. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు ఎంత మంది పనిచేసినా వ్యర్థమవుతూనే ఉంది. ఎంత మంది ఫిర్యాదులు చేసినా సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని లింక్స్‌ను తొలగించిన పైరసీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.

రెచ్చిపోతోన్న తమిళ రాకర్స్
పైరసీ చేయడంలో తమిళ రాకర్స్ ముందుంటుంది. నిర్మాతలకు హెచ్చరికలు జారీ చేసి మరీ పైరసీ చేస్తుంది. ఎంతటి పెద్ద హీరో సినిమా అయినా సరే మొదటి ఆట పూర్తవ్వగానే ఆన్‌లైన్‌లో పెట్టేస్తూ ఉంటుంది. వీటి ధాటికి బడా బడా ప్రొడ్యూసర్లు బెదిరిపోతూ ఉంటారు. తాజాగా దీని వలలో దర్బార్ చిత్రం కూడా చిక్కినట్టు తెలుస్తోంది.

సంక్రాంతి బరిలో దిగిన రజినీ..
సంక్రాంతి రేసులోకి వచ్చిన దర్బార్.. మిగిలిన అన్ని చిత్రాల కంటే కాస్త ముందుగా థియేటర్ల కు వచ్చేసింది. రజినీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్న దర్బార్‌కు తెలుగు నాట పర్వాలేదనిపించేలా ఉన్నా.. కోలీవుడ్‌లో మాత్రం రికార్డులను బ్రేక్ చేసేలానే ఉంది. ఇదిలా ఉండగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్బార్‌ను.. విడుదలైన గంటల్లోనే పైరసీ చేసినట్టు తెలుస్తోంది.

భారీ క్రేజున్న చిత్రం..
సంక్రాంతి సీజన్‌లో రావడం.. తెలుగు హీరోలతో పోటీకి దూరంగా ఉండటం.. మురుగదాస్ లాంటి దర్శకుుడు తోడు కావటంతో ఈ సినిమా బిజినెస్ భారీగా సాగింది. అయితే.. సినిమా రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే పైరసీ చేసి.. ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేసిన వైనం కలకలం రేపుతోంది. దీంతో యూనిట్ షాక్‌కు గురైంది.

మొదటి రోజు దుమ్ములేపిన దర్బార్
అందరూ ఊహించినట్లుగానే 'దర్బార్' సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టిందని తెలుస్తోంది. విడుదలైన అన్నిచోట్లా దర్బార్ దూసుకుపోయిందని టాక్. ఓవర్సీస్‌లో కూడా రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. మొత్తంగా తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి.