»   »  నిర్మాతగా మారుతున్న హీరోయిన్ తాప్సీ

నిర్మాతగా మారుతున్న హీరోయిన్ తాప్సీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అంతంత మాత్రం అవకాశాలతో నెట్టుకొస్తున్న హీరోయిన్ తాప్సీ త్వరలో నిర్మాత అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తోంది. సరైన విజయం లేక చాలా కాలంగా సతమతం అవుతున్న తాప్సీకి ఎట్టకేలకు ఇటీవల విడుదలై తమిళ చిత్రం ‘కాంచన-2' విజయంతో కాస్త ఊరట లభించినట్లయింది.

తాజాగా ఫిల్మ్ నగర్ వర్గా ల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆమె కాంచన-2 చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలీతో కలిసి ఈ చిత్రం రీమేక్ లో పాలు పంచుకోనుందని అంటున్నారు. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ఇక ‘కాంచన-2' చిత్రం తెలుగులో ‘గంగ' పేరుతో విడుదల కాబోతోంది. ఈ నెల 17న విడుదల కావాల్సి ఉండగా నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆర్థిక పరమైన ఇబ్బందులతో విడుదల ఆగిపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని నిర్ణయించారు. అదే రోజు బాలయ్య నటించిన ‘లయన్' చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండటం గమనార్హం.

 Tapsi to turn Producer

తెలుగులో ఈ చిత్రం విడుదల ఆగిపోవడానికి కారణం...నిర్మాత బెల్లంకొండ సురేష్ అప్పులే కారణమని అంటున్నారు. బెల్లంకొండ సురేష్ గత సినిమాలు అల్లుడు శ్రీను, రభస భారీ నష్టాలు మిగిల్చాయి. ఆయా సినిమాలకు సంబంధించిన అప్పులు బెల్లంకొండ ఇంకా క్లియర్ చేయలేదట. దీంతో తమ అప్పుల విషయం తేలిస్తేగానీ ‘గంగా' సినిమాను విడుదల కానివ్వమంటూ కూర్చున్నారట ఫైనాన్షియర్లు. సినిమా విడుదలైన తర్వాత వచ్చే కలెక్షన్లతో అప్పుత తీరుస్తానని అంటున్నాడట బెల్లంకొండ. అయితే గ్యారంటీ ఇవ్వనిదే ససేమిరా అంటున్నారట ఫైనాన్షియర్లు. మొత్తానికి సినిమా విడుదలకు అడ్డంకులు తొలగడంతో ‘గంగ' విడుదల కోసం ఎదురు చూస్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.

సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవలే ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

English summary
Reports are doing the rounds about Tapsi remaking ‘Kanchana 2’ in Bollywood. The reports further said that Taapsee will be joining hands with popular Hindi filmmaker Sanjay Leela Bhansali for the remake.
Please Wait while comments are loading...