‘జయం’ సదాతో ఆ అడల్ట్ కథనే తెరకెక్కించటానికే దర్శకుడు తేజ
ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన 'జయం" చిత్రం ఎంత సూపర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంతో పరిచయమైన సదా ఆ తర్వాత పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే ఇప్పుడామె ఖాళీ పడిపోయింది. తేజ కూడా వెంకటేష్ తో అనుకున్న ప్రాజెక్టు ఆగిపోవటంతో పూర్తి ఖాళి పడ్డారు. దాంతో తామిద్దరం మళ్ళీ కలిస్తే క్రేజీ కాంబినేషన్ అవుతుందని తేజ భావించి ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం.ఆ చిత్రం మరేదో కాదు...ఇంతకు ముందు ప్రారంభించి ఆపుచేసిన అటు-ఇటు చిత్రం అని తెలుస్తోంది. అప్పట్లో ఈ చిత్రం ద్వారా దాదాపు నలభై మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేయాలని నిర్ణయించుకుని ప్రెస్ నోట్ ద్వారా ఆ విషయాన్ని తెలియ చేయటం జరిగింది. ఈ చిత్రాన్ని జయం మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తానని. ఓ దురదృష్టవంతుడైన కుర్రాడు ప్రేమ కోసం తపిస్తూ ఓ టీనేజ్ అమ్మాయి ప్రేమలో పడటం కధాంశమని అన్నారు. మనీషా కొయరాలా తో తీసిన ఏక్ చోటీసీ లవ్ స్టోరీ తరహాలో ఈ చిత్రం కథ ఉంటుందని అప్పట్లో చెప్పుకున్నారు. ఇప్పుడదే దుమ్ముదులుపి సదాకు చెప్పినట్లు ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్త్తున్నారు. అప్పట్లో అది బూతు చిత్రంలా ఉంటుందని కొందరు పరిశ్రమలో పెద్దలు చెప్పటంతో ఆగిపోయారు. అయితే చిత్రంలాంటి హిట్ కొట్టాలంటే ఆ రేంజి సన్నివేశాలు ఉండాల్సిందే అని పిక్స్ అయి ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











