Teja Sajja Mirai Remuneration: మిరాయ్ చిత్రానికి తేజా సజ్జా షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులను అలరించిన తేజా సజ్జా ఇప్పుడు సూపర్ హీరో చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ములేపుతున్నారు. చివరిగా తేజా సజ్జా పాన్ ఇండియా ఫిల్మ్ హను-మ్యాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను అలరించారు.
హను -మ్యాన్ చిత్రంతో తేజా సజ్జా బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేశారు. బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో తేజా సజ్జా రేంజ్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. దీంతో తేజా సజ్జా రెమ్యునరేషన్ ఎంత ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. హనుమ్యాన్ చిత్రానికి తేజా సజ్జా రూ.2 కోట్లు పారితోషికం తీసుకున్నారనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిరాయ్ చిత్రం కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది.

సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. అయితే హనుమ్యాన్ చిత్రం నుంచి భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో తేజా సజ్జా రేంజ్ అమాంతం పెరిగిందని, దాంతో పారితోషికం కూడా భారీగా పెంచేశారని ప్రచారం జరిగింది.అయితే, మిరాయ్ ప్రమోషన్స్ లో మాత్రం తేజా సజ్జా తన రెమ్యూనరేషన్ పై ఆసక్తికరంగా స్పందించారు.
తన ప్రమోషన్స్ లో ఎలాంటి మార్పులు లేవని, తనకు మంచి సినిమాలు అందించడం ముఖ్యమని అందుకే తనకు రెమ్యునరేషన్ పై పెద్దగా ఆసక్తి లేదన్నారు. హనుమ్యాన్ చిత్రానికి ఎన్ని కోట్లు తీసుకున్నానో అంతే మిరాయ్ చిత్రానికి కూడా అంతే తీసుకున్నానని చెప్పుకొచ్చారు. కాగా, మిరాయ్ చిత్రంతో తేజా సజ్జా తన పారితోషికాన్ని పెంచేశారని ప్రచారం జరిగింది. ఏకంగా సినిమాకు రూ.10 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నారని టాక్ వినిపించింది. పాన్ ఇండియా హీరోగా తేజా సజ్జా గుర్తింపు పొందడంతో ఇలా పారితోషికాన్ని భారీగా పెంచేశారని అంటున్నారు.
తేజా సజ్జా మాత్రం రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. దీనిపై మున్ముందు మరింత స్పష్టత రానుంది. ఇక మిరాయ్ చిత్రంలో హీరోయిన్ రితికా నాయక్ నటించింది. శ్రియా, జగపతిబాబు, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటించారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇక మిరాయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తేజా సజ్జా మిరాయ్ చిత్రం ఓటీటీ రైట్స్ ను జియోహాట్ స్టార్ సంస్థ రూ.40 కోట్లకు దక్కించుకుందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తైన వెంటనే ఈ చిత్రం ఓటీటోలోకి ఎంట్రీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications











