twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు సినిమా పరిశ్రమ జెండా ఇదే..?

    By Bojja Kumar
    |

    తెలుగు తొలి టాకీ సినిమా 'భక్త ప్రహ్లాద" విడుదలై 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల (సెప్టెంబర్ 15)న సంబరాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి ప్రముఖులు మీడియాతో మాట్లాడుతూ ఇకపై ప్రతి ఏటా ఈ రోజున తెలుగు చలన చిత్రోత్సవాలను జరుపుతామని ప్రకటించారు. తెలుగు సినిమా పరిశ్రమ కోసం ప్రత్యేకంగా ఓ జెండాను రూపొందిస్తున్నట్లు కూడా వెల్లడించారు. తెలుగు సినిమా పరిశ్రమ కింద పని చేసే సంస్థలు, వ్యక్తుల ఇళ్లపై ఈ జెండా రెపరెపలాడనుంది.

    విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఇప్పటికే..జెండా ఓ రూపుకు వచ్చినట్లు తెలుస్తూంది. ఓ ప్రముఖ లోగో డిజైనర్ ఈ జెండాను రూపొందించినట్లు సమాచారం. పక్క ఫోటోలో చూస్తున్నదే తెలుగు సినీ పరిశ్రమ జెండా ఊహా చిత్రం. తెలుగుదనం ఉట్టి పడేలా ఇందులో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. పరిశ్రమలోని పలువురు ప్రముఖులు జెండా డిజైన్ పై అంగీకారం తెలిపిన తర్వాత దీన్ని అధికారికంగా బయటకు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే వచ్చే ఏడాది ఈ జెండా ఆవిష్కరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    English summary
    On September 15th this was unveiled and ideally it should be hoisted across all studios, theaters and film establishments. But due to delay in preparation of the flag that didn’t take place. So now, they are planning to hoist it from next year onwards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X