WorldFamousLover: వసూళ్ళలో వెనుకబడ్డ రౌడీ స్టార్!! అసలు కారణం ఇదే..

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ సినిమా అంటేనే జనాల్లో అదో క్రేజ్. ఈ హీరో సినిమా చూడాలని ఎగబడుతుంటారు యూత్ ఆడియన్స్. అలాటింది ఇప్పటికే 'డియర్ కామ్రేడ్' సినిమాతో సీన్ రివర్స్ కాగా.. తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ పెద్దగా అట్రాక్ట్ చేయకపోతుండటం ఆయన ఫాన్స్‌ని హర్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ ఫేమస్ లవర్ కలెక్షన్స్ డ్రాప్ వెనుక ఉన్న అసలు కారణం ఇదే అంటూ వస్తున్న కొన్ని వార్తలు జనాలకు షాకిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి పోతే..

నలుగురు హీరోయిన్స్.. భారీ అంచనాలు

నలుగురు హీరోయిన్స్.. భారీ అంచనాలు

'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారని, రొమాంటిక్ డోస్ అదిరిపోతుందని ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనికి తోడు విడుదలకు ముందు ఈ సినిమా ప్రమోషన్స్ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.

కలెక్షన్స్ డ్రాప్.. మౌత్ టాక్

కలెక్షన్స్ డ్రాప్.. మౌత్ టాక్

ఈ పరిస్థితుల్లో విడుదలైన 'వరల్డ్ ఫేమస్ లవర్' తొలిరోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మౌత్ టాక్ కూడా కలిసిరాలేదు. దీంతో క్రమంగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్.. అలాగే రాశిఖన్నా, ఇజబెల్లా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ ట్రెసా అందాలు సినిమాను కాపాడలేక పోతున్నాయి.

బాల్ సిక్స్ కొట్టారు.. ఇప్పుడు

బాల్ సిక్స్ కొట్టారు.. ఇప్పుడు

''బాల్ సిక్స్ కొట్టాను, అది గాల్లోనే ఉంది.. ఆడియన్స్ చూసాక సిక్సా, ఔటా చెప్తారు'' అని విజయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అన్నారు. ప్రస్తుతానికైతే కలెక్షన్స్ రిపోర్ట్స్ ఆధారంగా అవుట్ అనే చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం విజయ్ దేవరకొండ అని టాక్ వస్తుండటం సెన్సేషన్‌గా మారింది.

సినిమా ఔట్‌పుట్.. విజయ్ దేవరకొండ అసంతృప్తి

సినిమా ఔట్‌పుట్.. విజయ్ దేవరకొండ అసంతృప్తి

ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు క్రాంతి మాధవ్‌కు, విజయ్‌కు క్రియేటివిటీ విషయంలో కొన్ని సమస్యలు వచ్చాయని.. సినిమా ఔట్‌పుట్ సరిగ్గా లేదని, తాను సంతృప్తిగా లేనని క్రాంతితో అన్నారట విజయ్ దేవరకొండ. అయితే విజయ్ మాట వినని క్రాంతి మాధవ్.. రీటేక్స్ అవసరం లేదని అనడంతో చివరకు కొన్ని సన్నివేశాలను విజయే డైరెక్ట్ చేసారని రూమర్స్ బయటకొస్తున్నాయి. ఇదే సినిమా డిజాస్టర్ కి కారణమైందనే వార్తలు షికారు చేస్తున్నాయి.

Recommended Video

Nani Vs Vijay Devarakonda Fans | V Teaser | World Famous Lover
విజయ్ దేవరకొండ.. బాక్సర్

విజయ్ దేవరకొండ.. బాక్సర్

ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘బాక్సర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా బాలీవుడ్ నటి అనన్య పాండే ను సెలెక్ట్ చేశారని తాజా సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X