'రంగస్థలం'కు ఆ సీన్స్ ఆయువుపట్టు: కథ ఇలా మలుపు తిరుగుతుందట..

రాంచరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న 'రంగస్థలం'పై భారీ అంచనాలే ఉన్నాయి. గత సినిమాల కన్నా రాంచరణ్ విభిన్న పాత్రలో కనిపించబోతుండటం.. పైగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో 'రంగస్థలం'పై అంచనాలు పెరిగిపోయాయి. ఒకప్పటి మెగాస్టార్ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఈ రంగస్థలంను తెరకెక్కిస్తున్నట్లుగా ఆమధ్య ప్రచారం జరిగింది. సినిమాకు కథకు సంబంధించి తాజాగా మరికొన్ని లీకులు బయటకు రావడం గమనార్హం.

కథేంటి?:

కథేంటి?:

పూర్తి విరుద్ద భావాలు కలిగిన ఇద్దరు అన్నదమ్ముల కథగా 'రంగస్థలం' తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇందులో రాంచరణ్ సోదరుడిగా ఆది పినిశెట్టి కనిపించబోతున్నారు. ఆది పాత్ర పూర్తిగా నెగటివ్ కోణంలో ఉంటుందని చెబుతున్నారు.

ఆ సీన్స్ హైలైట్‌ అయువుపట్టు..:

ఆ సీన్స్ హైలైట్‌ అయువుపట్టు..:

సోదరుడు ఆది పినిశెట్టి తీరు వల్ల రాంచరణ్ కుటుంబానికి కలిగే ఇబ్బందులు.. ఈ క్రమంలో సోదరుల మధ్య తలెత్తే విభేదాలు.. వాటి చుట్టు అల్లుకున్న భావోద్వేగాలతో సినిమా నడుస్తుందని తెలుస్తోంది. ప్రధానంగా రాంచరణ్-ఆదిపినిశెట్టి మధ్య చోటు చేసుకునే సెంటిమెంట్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని భావిస్తున్నారట.

 ఇలా మలుపు తిరుగుతుందట..:

ఇలా మలుపు తిరుగుతుందట..:

సినిమాలో ఆది పినిశెట్టి పాత్ర చనిపోతుందని, ఆ తర్వాత సినిమా మరో మలుపు తీసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. ప్రత్యక్షంగా.. పరోక్షంగా తాను చూసిన.. తెలుసుకున్న కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించినట్లు చెబుతున్నారు.

ప్రతీకారం నేపథ్యంలో..:

ప్రతీకారం నేపథ్యంలో..:

సినిమాలో ఆదిపినిశెట్టి పాత్ర చనిపోతుంది అంటే.. తమ్మున్ని చంపినవాళ్లపై రాంచరణ్ ప్రతీకారం తీర్చుకోవడమే ఈ సినిమాకు క్లైమాక్స్!‌గా ఉండబోతుందా?.. అందుకే టీజర్ లోనూ రాంచరణ్ ఆవేశంగా కత్తి పట్టుకుని వెళ్తున్న సీన్ చూపించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మెగాస్టార్ సినిమాతో లింకు:

మెగాస్టార్ సినిమాతో లింకు:

అన్నదమ్ముల కాన్సెప్టుతో అప్పట్లో మెగాస్టార్ 'ఊరికిచ్చిన మాట' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ కాన్సెప్టు కూడా అదేనన్న లీక్స్ బయటకు రావడంతో.. ఈ రెండు సినిమాలకు లింకు పెట్టారు. కానీ కథాపరంగా ఈ రెండింటికి పోలిక లేదని చెబుతున్నారు.

రిలీజ్ ఎప్పుడు:

రిలీజ్ ఎప్పుడు:

ఇటీవలే రిలీజ్ చేసిన రంగస్థలం టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సిట్టిబాబు పాత్రలో రాంచరణ్ నటన అభిమానులను మెప్పించింది. ఈ సినిమా మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X