»   » సెటైర్ల రామ్ గోపాల్ వర్మ పై టాలీవుడ్ లో జోకులే..జోకులు...

సెటైర్ల రామ్ గోపాల్ వర్మ పై టాలీవుడ్ లో జోకులే..జోకులు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు టాలీవుడ్ లో సీను రివర్స్ అయింది. నిన్నటి వరకు టాలీవుడ్ మీద తెగ జోకులేసేసిన రామ్ గోపాల్ వర్మ మీద, ఇప్పుడు టాలీవుడ్ లో ప్రతీ ఒక్కరూ జోకులేసేస్తున్నారు. ఒకరికొకరు ఫోన్లు చేసుకుని మరీ నవ్వుకుంటూ కామెంట్లు చేసుకుంటున్నారు. షూటింగుల్లో అయితే ఇక చెప్పేక్కర్లేదు, ఎక్కడ చూసినా ఈ టాపిక్కే. దీనికి కారణం...వర్మ లేటెస్ట్ గా తీసిన 'అప్పల్రాజు' కి ఫ్లాప్ టాక్ రావడమే.

టాలీవుడ్ మీద సెటైర్ గా రూపొందించిన ఈ సినిమా పట్ల తెలుగు సినిమా రంగంలోని వాళ్లంతా మొదటి నుంచీ అయిష్టంగానే వున్నారు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని కూడా కోరుకున్నారంతా. దాని కోసమే ఎదురుచూస్తూ, ఆ క్షణం రాగానే ఇక మోసేయడం మొదలెట్టారు. పాపం... ఇందులో యాక్ట్ చేసినందుకు సునీల్ కూడా వాళ్లకి దొరికిపోయాడు. మూలుగానే వర్మ అన్నా, వర్మ వ్యవహార శైలి అన్నా టాలీవుడ్ లో చాలా మందికి మింగుడు పడదు. ఇప్పుడీ సినిమా కూడా అందుకు తగ్గట్టుగా ఉండడంతో ఇక అంతా పండగ చేసుకుంటున్నారు. అయితే... షరా మామూలుగా వర్మ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడు.

English summary
The film factory Ram Gopal Varma has come up with his Telugu directorial Katha Screenplay Darsakathvam Appalaraju after a long span of 12 years. The movie is expected to be a satire on film industry and people living on it. KSD Appalaraju is releasing with considerable hype as it got the excellent publicity tactics of Ram Gopal Varma behind it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu