twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థియేటర్స్ ఓపెనయితే టాలీవుడ్ లో కొత్త టెన్షన్… లైనప్ రెడీ చేస్తున్న నిర్మాతలు?

    |

    కరోనా మహమ్మారి కారణంగా దాదాపు భారత దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లి పోయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడిప్పుడే కరోనా కేసు తగ్గడంతోపాటు, పాజిటివ్ రేటు తగ్గడంతో కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలను సడలిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంక్షలు నెమ్మదిగా సడలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు థియేటర్ లు ఓపెన్ అయితే సినిమా రిలీజ్ పరిస్థితి టెన్షన్ పెడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

     తగ్గుతున్న ఉదృతి

    తగ్గుతున్న ఉదృతి

    దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ డే ఉద్ధృతి నెమ్మదిగా తగ్గుతుంది. మహారాష్ట్ర సహా ఢిల్లీలో నెమ్మదిగా కరోనా ఆంక్షలు కూడా సడలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కూడా మరి కొద్ది రోజుల్లో కరోనా ఆంక్షలు సడలించడమే కాక థియేటర్లు ఓపెన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు.. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ ల విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది.

    రిలీజ్ డేట్స్ మీద కర్చీఫ్ లు

    రిలీజ్ డేట్స్ మీద కర్చీఫ్ లు

    నిజానికి గత ఏడాది చివర్లో థియేటర్ లు ఓపెన్ చేసినా ఈ ఏడాది మొదటి వరకు సినిమాలను ప్రజలు ఆదరిస్తారని నమ్మకం మన మేకర్స్ కు కలగలేదు. ఎప్పుడైతే రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిందో ఇక మేకర్స్ కు మన తెలుగు ప్రేక్షకుల మీద నమ్మకం వచ్చేసింది. దీంతో ఆ దెబ్బకు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా దాదాపు అందరూ రిలీజ్ డేట్స్ మీద కర్చీఫ్ లు వేశారు.

    రిలీజ్ డేట్ విషయంలో పోటీ

    రిలీజ్ డేట్ విషయంలో పోటీ

    రిలీజ్ డేట్ విషయంలో పోటీ అయితే ఎవరూ ఊహించని విధంగా సెకండ్ వేవ్ కూడా వచ్చి పట్టడంతో థియేటర్లు మళ్ళీ మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు సహా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ థియేటర్ లు ఓపెన్ అయితే రిలీజ్ డేట్ విషయంలో మళ్లీ మునుపటి పోటీ కనిపిస్తోంది. ఈ విషయంలో టాలీవుడ్ బడా నిర్మాతలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

    దసరా మీద కన్ను

    దసరా మీద కన్ను

    సంక్రాంతి తర్వాత టాలీవుడ్ కి పెద్ద సీజన్ సమ్మర్ సీజన్ కాగా అది పూర్తయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు పెద్ద సినిమాలు కన్ను దసరా మీద పడిందని అంటున్నారు. ప్రస్తుతానికి రిలీజ్ కి సిద్ధంగా రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఆచార్య, రాధేశ్యామ్ సినిమాల పేర్లు ముఖ్యంగా వినపడుతున్నాయి. ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి స్థాయిలో కాకపోయినా రెండిటికి మరో పది పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది.

     ఆర్ ఆర్ ఆర్ కష్టమే

    ఆర్ ఆర్ ఆర్ కష్టమే

    ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు దసరాకి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా దసరాకి రిలీజ్ చేస్తామని ముందు డేట్ ప్రకటించినా అప్పటికి రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి అంటున్నారు. అందుకే చిరంజీవి, ప్రభాస్ సినిమాలు దసరాకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

    మిగతావన్నీ ముందుగానే

    మిగతావన్నీ ముందుగానే

    ఇక పెద్ద సినిమాలన్నీ దసరాని టార్గెట్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కి సిద్ధంగా ఉన్న నాగచైతన్య - లవ్ స్టోరీ, నాని - టక్ జగదీష్, అక్కినేని అఖిల్ - మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.. ఇక మిగతా సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్న దాన్నిబట్టి రిలీజ్ డేట్స్ ఖరారు చేసుకునే అవకాశం కనిపిస్తుంది.

    English summary
    We all know corona cases in telugu states are gradually decreasing. Some reports says that all the theatres may open from july. so Chiranjeevi’s Acharya, Prabhas’s Radhe Shyam are eying on Dussera season. Other medium-range films like Nage Chaitanya's Love Story,Nani's Tuck Jagadish,Akhil's Most Eligible Bachelor, and are likely to release in September.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X